సినిమా కోసం వంట నేర్చుకుంటున్న యంగ్ హీరో

దిశ, సినిమా: తరుణ్ భాస్కర్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీ విజయ్‌కు హీరోగా తొలి చిత్రం కాగా.. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కాగా ఈ మూవీని తమిళ్‌లో రీమేక్ చేస్తున్నాడు హీరో హరీశ్ కళ్యాణ్. కార్తీక్ సుందర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు ‘ఓ మనపెన్నే’ టైటిల్ కన్‌ఫర్మ్ కాగా.. ఈ చిత్రంలో చెఫ్‌గా కనిపించనున్న హరీశ్ కళ్యాణ్ ఇందుకు సంబంధించిన ట్రిక్స్ నేర్చుకునే పనిలో […]

Update: 2021-08-09 06:55 GMT

దిశ, సినిమా: తరుణ్ భాస్కర్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీ విజయ్‌కు హీరోగా తొలి చిత్రం కాగా.. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కాగా ఈ మూవీని తమిళ్‌లో రీమేక్ చేస్తున్నాడు హీరో హరీశ్ కళ్యాణ్. కార్తీక్ సుందర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు ‘ఓ మనపెన్నే’ టైటిల్ కన్‌ఫర్మ్ కాగా.. ఈ చిత్రంలో చెఫ్‌గా కనిపించనున్న హరీశ్ కళ్యాణ్ ఇందుకు సంబంధించిన ట్రిక్స్ నేర్చుకునే పనిలో ఉన్నాడు. ఎంటర్‌ప్రెన్యుయర్ సిద్ధా్ంత్ జీవితకథ ఆధారంగా వస్తున్న చిత్రంలో తనను గెస్ట్‌గా చూపించే ప్రయత్నంలో సెట్‌కు ఆహ్వానించారు దర్శకులు.

ఈ క్రమంలోనే హీరోకు కుకింగ్ లెసన్స్ నేర్పిస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతకుముందు కుకింగ్‌పై ఏమాత్రం అవగాహన లేని హరీశ్ కళ్యాణ్.. చికెన్ అండ్ ఫిష్ డిషెస్, సమోసా, బర్గర్స్ అండ్ ఫిల్లింగ్స్, డిషెస్‌ను స్టైలిష్‌గా ఎలా ప్రజెంట్ చేయాలనేది నేర్చుకున్నట్లు చెప్పాడు. కుకింగ్ సీన్స్‌ కాన్ఫిడెంట్‌గా చేసేందుకు సిద్ధాంత్, హీరోయిన్ భవానీ శంకర్, అమ్మ హెల్ప్ చేస్తున్నారన్న ఆయన.. సినిమాలో సమోసాకు స్పెషల్ స్టోరీ ఉందని తెలిపాడు.

Tags:    

Similar News