‘కొత్త విమానాశ్రయాలకు ప్రతిపాదనలు రాలేదు’

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ చెప్పారు. గురువారం పార్లమెంటులో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. “దేశవ్యాప్తంగా విమానాశ్రయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు అనే పాలసీని ప్రవేశపెట్టింది. అయితే ఈ పాలసీ ప్రకారం కేంద్ర పౌరవిమానాయన శాఖ నుంచి సూత్రప్రాయ అనుమతులు తీసుకున్న తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం […]

Update: 2020-03-12 06:19 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ చెప్పారు. గురువారం పార్లమెంటులో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.

“దేశవ్యాప్తంగా విమానాశ్రయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు అనే పాలసీని ప్రవేశపెట్టింది. అయితే ఈ పాలసీ ప్రకారం కేంద్ర పౌరవిమానాయన శాఖ నుంచి సూత్రప్రాయ అనుమతులు తీసుకున్న తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఎయిర్‌పోర్టు కంపెనీ లేదా వ్యక్తులుకానీ విమానాశ్రయాలను అభివృద్ధి చేసుకునే వీలుంటది. ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలకునుకుంటే మొదటగా స్థల అనుమతుల కోసం స్క్రీనింగ్ కమిటికీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ ఈ విధానం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం లేదా ఇతర సంస్థల నుంచి కానీ కేంద్రానికి ప్రతిపాదనలు రాలేదు. కానీ, తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఆ రాష్ట్రంలో విమానయాన మౌలిక వసతుల అభివృద్ధికి గల సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాథమిక అధ్యయనం చేసింది” అని మంత్రి వివరించారు. వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌సహా తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన కొత్త విమానాశ్రయాల కోసం ఆరు ప్రదేశాలలో ప్రాథమిక అధ్యయనం చేసిన విషయం తెలిసిందే.

Tags: airports in telangana, central minister, new airports, AAI

Tags:    

Similar News