ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. విద్యార్థిని బలి
దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. యువకుడి వేధింపులకు ఓ విద్యార్థిని బలైంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన దుగ్గి రేవతి అనే యువతి పదో తరగతి చదువుతోంది. గత కొంతకాలంగా అనే గ్రామానికి చెందిన పేరబోయిన సాయి అనే యువకుడు ప్రేమిస్తున్నానని రేవతిని వేధింపులకు గురిచేసేవాడు. ఈ విషయాన్ని ఆమె తల్లితండ్రులకు తెలియజేసింది. దీంతో సాయిని పలుమార్లు వారు మందలించారు. అయినా.. పట్టించుకోకుండా మళ్లీ […]
దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. యువకుడి వేధింపులకు ఓ విద్యార్థిని బలైంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన దుగ్గి రేవతి అనే యువతి పదో తరగతి చదువుతోంది. గత కొంతకాలంగా అనే గ్రామానికి చెందిన పేరబోయిన సాయి అనే యువకుడు ప్రేమిస్తున్నానని రేవతిని వేధింపులకు గురిచేసేవాడు. ఈ విషయాన్ని ఆమె తల్లితండ్రులకు తెలియజేసింది. దీంతో సాయిని పలుమార్లు వారు మందలించారు. అయినా.. పట్టించుకోకుండా మళ్లీ వేధింపులకు గురిచేయసాగాడు. దీంతో వేధింపులు భరించలేక గురువారం సాయంత్రం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు రేవతిని ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె మృతిచెందింది. పేరబోయిన సాయి వేధింపులు తాళలేకనే తమ బిడ్డ చనిపోయిందని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సాయిని కఠినంగా శిక్షించాలని రేవతి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్రావు తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
మైనర్ బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : బత్తుల సోమయ్య
నిరుపేద కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మానసికంగా వేధించి ఆత్మహత్య చేసుకునేలా ప్రవర్తించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, రాష్ట్ర ప్రభుత్వం బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య డిమాండ్ చేశారు. శనివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో సూపరిండెంట్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో భయబ్రాంతులకు గురిచేస్తున్న సాయి అనే రౌడీషీటర్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. బాలిక తల్లిదండ్రులు నిరుపేదలని వారిని అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అక్షరాలు శ్రీలక్ష్మి, అధ్యక్షుడు సైదులు పాల్గొన్నారు.