మియాపూర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..

దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంట్లో ఉన్న బంగారం

Update: 2025-03-27 07:27 GMT
మియాపూర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..
  • whatsapp icon

దిశ,శేరిలింగంపల్లి : దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు, చోరీకి గురైన ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీసాయి నగర్ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితుడు శ్రీకాంత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం. మియాపూర్ శ్రీ సాయి నగర్ కాలనీలో శ్రీకాంత్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కొమరవెళ్లి మల్లన్నను దర్శించుకునేందుకు వెళ్లారు. మరుసటి రోజు బుధవారం ఉదయం ఐదున్నర గంటలకు ఇంటి యజమాని శ్రీకాంత్ ఫోన్ చేసి మీ ఇంటి తాళం తీసి ఉందని తెలిపాడు.

వెంటనే శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా తలుపులు బద్దలు కొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా సుమారు 25 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 30 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. అలాగే ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీ కూడా చోరీకి గురైంది. దీంతో శ్రీకాంత్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News