నవ్వుతో వైరల్ అవుతున్న జొమాటో స్మైలింగ్ బాయ్

దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో ఒక్క వీడియోలో కన్ను కొట్టి రాత్రికి రాత్రే ఓ హీరోయిన్ సెలెబ్రిటీ అయింది. ఇప్పుడు ఒక్క చిరునవ్వుతో ఓ సాధారణ వ్యక్తి ఇంటర్నెట్లో బాగా పాపులర్ అవుతున్నాడు. అతని పేరు సోను. ఢిల్లీలో జొమాటో కంపెనీకి ఫుడ్ డెలివరీ చేసే ఉద్యోగం చేస్తున్న సోను, చిన్న చిరునవ్వుతో అందరి మనసులను దోచేస్తున్నాడు. ఎలాంటి కల్మషం లేకుండా ఉన్నంతలో ఆనందంగా ఉండే సంతృప్తికర జీవితం అతని కళ్లలో కనిపిస్తోందని నెటిజన్లు తెగపొగిడేస్తున్నారు. ఢిల్లీ డీసీ […]

Update: 2020-02-29 01:21 GMT

దిశ, వెబ్‌డెస్క్:
అప్పట్లో ఒక్క వీడియోలో కన్ను కొట్టి రాత్రికి రాత్రే ఓ హీరోయిన్ సెలెబ్రిటీ అయింది. ఇప్పుడు ఒక్క చిరునవ్వుతో ఓ సాధారణ వ్యక్తి ఇంటర్నెట్లో బాగా పాపులర్ అవుతున్నాడు. అతని పేరు సోను. ఢిల్లీలో జొమాటో కంపెనీకి ఫుడ్ డెలివరీ చేసే ఉద్యోగం చేస్తున్న సోను, చిన్న చిరునవ్వుతో అందరి మనసులను దోచేస్తున్నాడు. ఎలాంటి కల్మషం లేకుండా ఉన్నంతలో ఆనందంగా ఉండే సంతృప్తికర జీవితం అతని కళ్లలో కనిపిస్తోందని నెటిజన్లు తెగపొగిడేస్తున్నారు.

ఢిల్లీ డీసీ రైడర్ అనే వ్లోగర్ తన వీడియోలో సోనుని మొదటిసారిగా చూపించాడు. ఆ వీడియోలో అతని సంపాదన గురించి, పనివేళల గురించి రైడర్ అడుగుతాడు. టిక్ టాక్‌లో ఈ వీడియో పోస్ట్ అయ్యాక అతని కల్మషం లేని చిరునవ్వు అందరి మనసుని దోచేసింది. ఒక్క టిక్ టాక్‌లోనే 47 లక్షల వీక్షణలతో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో విపరీతంగా వైరల్ అయింది. అతని ముఖంతో ఎన్నో వైరల్ మీమ్‌లు, వీడియోలు వచ్చేశాయి. సోను చిరునవ్వు వైరల్ అవడం వల్ల జొమాటోకి ఉచిత పబ్లిసిటీ దొరికినట్లయింది. దీంతో అతని ఫొటోను తమ అన్ని సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్ లాగ పెట్టేసి జొమాటో ప్రకటనలు మొదలుపెట్టేసింది. జొమాటో వారి ఈ స్టంట్‌ని చూసి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సోనుని సీఈఓ చేసినా తప్పు లేదు, అతనికి జీతం పెంచండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News