అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి : వీహెచ్

దిశ, న్యూస్‌బ్యూరో : రాష్ట్రంలో (కొవిడ్ -19) కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలు, ప్రజా సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలతో అఖిపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కొవిడ్-19 నివారణ చర్యలపై ప్రతిపక్షాలు సలహాలు తీసుకుంటున్నారని, రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం సైతం ప్రతిపక్ష పార్టీలను సంప్రదించి సలహాలు తీసుకోవాలని చెప్పినట్టు వెల్లడించారు. కానీ, కేసీఆర్ మాత్రం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు లేదని […]

Update: 2020-04-26 11:47 GMT

దిశ, న్యూస్‌బ్యూరో : రాష్ట్రంలో (కొవిడ్ -19) కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలు, ప్రజా సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలతో అఖిపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కొవిడ్-19 నివారణ చర్యలపై ప్రతిపక్షాలు సలహాలు తీసుకుంటున్నారని, రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం సైతం ప్రతిపక్ష పార్టీలను సంప్రదించి సలహాలు తీసుకోవాలని చెప్పినట్టు వెల్లడించారు. కానీ, కేసీఆర్ మాత్రం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు లేదని విమర్శించారు. ఓటు హక్కు లేదనే.. వలస కూలీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన కరోనా సహాయ నిధి విరాళాల లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

Tags: Corona virus, Modi, KCR, VH, Migrant labour

Tags:    

Similar News