బ్రేకింగ్: హైదరాబాద్‌లో హనుమాన్ శోభయాత్ర రద్దు

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా ఎంతో ఘనంగా నిర్వహించే శోభయాత్రను రద్దు చేస్తు్న్నట్టు బజరంగ్ దళ్ నిర్వహకులు ప్రకటించారు. నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అంతేగాకుండా.. రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో చాలా చోట్ల ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు భక్తులు లేకుండానే నిర్వహిస్తున్నారు. కాగా, ఇప్పటికే హైదరాబాద్‌లో హనుమాన్ శోభయాత్రకు రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. […]

Update: 2021-04-27 00:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా ఎంతో ఘనంగా నిర్వహించే శోభయాత్రను రద్దు చేస్తు్న్నట్టు బజరంగ్ దళ్ నిర్వహకులు ప్రకటించారు. నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అంతేగాకుండా.. రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో చాలా చోట్ల ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు భక్తులు లేకుండానే నిర్వహిస్తున్నారు. కాగా, ఇప్పటికే హైదరాబాద్‌లో హనుమాన్ శోభయాత్రకు రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ మందిర్ వరకు సాగే ఈ శోభయాత్రలో 21 మంది మించకూడదని, ర్యాలీలో బైక్‌ల మీద ఒకరి కంటే ఎక్కువ వెళ్లకూడదు. అలాగే కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. అయితే.. ఊహించని స్థాయిలో భక్తులు రావడంతో శోభయాత్రను రద్దు చేస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు.

Tags:    

Similar News