చేనేతలకు కూడా ఒకరోజు ఉండాలి
దిశ ప్రతినిధి, మెదక్: భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్య్ర సమపార్జనకు ఒక సాధనంగా నిలిచిందని చేనేత గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, జ్ఞానప్రతిష్ఠ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జగ్గు మల్లారెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జాయింట్ కలెక్టర్ పద్మాకర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ… భారత స్వాతంత్రోద్యమంలో చేనేత అహింసాయుత ఉద్యమానికి నాంది పలికిందన్నారు. చేనేత రంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యర్రమాద […]
దిశ ప్రతినిధి, మెదక్: భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్య్ర సమపార్జనకు ఒక సాధనంగా నిలిచిందని చేనేత గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, జ్ఞానప్రతిష్ఠ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జగ్గు మల్లారెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జాయింట్ కలెక్టర్ పద్మాకర్‌ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ… భారత స్వాతంత్రోద్యమంలో చేనేత అహింసాయుత ఉద్యమానికి నాంది పలికిందన్నారు. చేనేత రంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యర్రమాద వెంకన్న నేత చేనేత దినోత్సవానికి సరైన తేదీ కోసం అధ్యయనం చేశాడాని జగ్గు మల్లారెడ్డి అన్నారు.
భారత స్వాతంత్య్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం వచ్చిందన్నారు. మొదటిసారిగా 1905లో బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని టౌన్‌హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించడం, దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారని తెలిపారు. అలా విదేశి వస్తు బహిష్కరణలో కీలకపాత్ర వహించిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా చేయాలని పిలుపునిచ్చారు.