నేతన్నల డిమాండ్లను పరిష్కరించాలి
దిశ, దుబ్బాక : సిరిసిల్ల తరహాలో దుబ్బాకలో టెక్ట్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవనేని రఘునందనరావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చేనేత కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు కార్యక్రమంలో రఘునందనరావు పాల్గొని నేతన్నలకు సంఘీభావం తెలిపారు. ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రఘునందనరావు డిమాండ్ చేశారు. రైతులకు అందిస్తున్న రైతు బీమా మాదిరి ప్రతి చేనేత కార్మికుడికి […]
దిశ, దుబ్బాక : సిరిసిల్ల తరహాలో దుబ్బాకలో టెక్ట్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవనేని రఘునందనరావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చేనేత కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు కార్యక్రమంలో రఘునందనరావు పాల్గొని నేతన్నలకు సంఘీభావం తెలిపారు.
ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రఘునందనరావు డిమాండ్ చేశారు. రైతులకు అందిస్తున్న రైతు బీమా మాదిరి ప్రతి చేనేత కార్మికుడికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్న చేనేత బంధు పథకాన్ని తెలంగాణలో వెంటనే అమలు చేయాలన్నారు.