లిప్‌స్టిక్, మస్కారాల్లో విషపూరిత రసాయనాలు
దిశ, ఫీచర్స్ : అందం, అలంకరణ కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం సర్వసాధారణం. అయితే అందులో వాడే కెమికల్స్ కారణంగా చర్మ సమస్యలు తలెత్తడంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ విషయం ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో నిరూపితమైనా, ఎంతోమంది స్కిన్ స్పెషలిస్ట్‌లు హెచ్చరిస్తున్నా.. వీటి వాడకం మాత్రం తగ్గడం లేదు. ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా రెట్టింపు అవుతున్నాయి. ఇదే విషయాన్ని తాజా పరిశోధన మరోసారి తేటతెల్లం చేసింది. యునైటెడ్ స్టేట్స్, […]
దిశ, ఫీచర్స్ : అందం, అలంకరణ కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం సర్వసాధారణం. అయితే అందులో వాడే కెమికల్స్ కారణంగా చర్మ సమస్యలు తలెత్తడంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ విషయం ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో నిరూపితమైనా, ఎంతోమంది స్కిన్ స్పెషలిస్ట్‌లు హెచ్చరిస్తున్నా.. వీటి వాడకం మాత్రం తగ్గడం లేదు. ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా రెట్టింపు అవుతున్నాయి. ఇదే విషయాన్ని తాజా పరిశోధన మరోసారి తేటతెల్లం చేసింది. యునైటెడ్ స్టేట్స్, కెనడాలో విక్రయించే సగం కంటే ఎక్కువ సౌందర్య సాధనాలు తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులతో సంబంధం ఉన్న విషపూరిత కెమికల్స్‌తో తయారువుతున్నాయని ఒక కొత్త అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ & టెక్నాలజీ లెటర్స్ ఇటీవలే ప్రచురితమైంది.
నోట్రే డామ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు సాధారణంగా ఉపయోగించే 230కు పైగా సౌందర్య సాధనాలను పరీక్షించారు. అందులో 56% ఫౌండేషన్స్ అండ్ ఐ ప్రొడక్ట్స్ , 48% లిప్ ప్రొడక్ట్స్, 47% మస్కారాల్లో ఫ్లోరిన్ ఉన్నట్లు కనుగొన్నారు. అంతేకాదు వాటర్ ప్రూఫ్ మస్కారా (82%), లాంగ్‌లాస్టింగ్ లిప్‌స్టిక్ (62%)లలో కొన్ని అత్యధిక PFAS(Per- and polyfluoroalkyl substances) స్థాయిలు కనుగొన్నారు. అధిక ఫ్లోరిన్ సాంద్రత కలిగిన ఇరవై తొమ్మిది ఉత్పత్తులను మరింత పరీక్షించగా, 4 అండ్ 13 స్పెసిఫిక్ PFAS రసాయనాలను కలిగి ఉన్నట్లు అధ్యయనం కనుగొంది. వినియోగదారు ఉత్పత్తుల్లో వీటి వినియోగాన్ని నియంత్రించడానికి కృషి చేస్తున్న చట్టసభ సభ్యులకు ఇది ఆందోళన కలిగించే అంశమే. సౌందర్య సాధనాలు, ఇతర బ్యూటీ ప్రొడక్ట్స్‌లో పీఎఫ్‌ఎఎస్ వాడకాన్ని నిషేధించే బిల్లును సెనేటర్ల ద్వైపాక్షిక బృందం ప్రవేశపెట్టిన నేపథ్యంలో, ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించడం గమనార్హం.
‘నెయిల్ పాలిష్, ఐ మేకప్, ఫౌండేషన్ వంటి ఉత్పత్తుల్లో తక్కువ స్థాయిలో పీఎఫ్ఎఎస్ రసాయన పదార్థాలుంటాయి. ఇవి ఎఫ్‌డీఏ భద్రతా ప్రమాణాలకు లోబడి ఉంటాయి’ అని పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కౌన్సిల్ ప్రధాన శాస్త్రవేత్త అలెగ్జాండ్రా కౌక్స్ చెప్పారు.
‘సౌందర్య సాధనాలు తక్షణ, దీర్ఘకాలిక ప్రమాదాలను కలిగిస్తాయి. PFAS రసాయనం రక్తప్రవాహంలోకి ప్రవేశించినప్పుడు, అది అక్కడే ఉండి పేరుకుపోతుంది. దీనివల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ప్రజలు ప్రతిరోజు తమ ముఖాలపై సౌందర్య ఉత్పత్తులను వాడుతుంటారు. వారికిది ఎంతమాత్రం క్షేమకరం కాదు. అంతేకాదు ఈ రసాయనాలను బయట పారేసినా.. పర్యావరణానికి హాని జరుగుతుంది. ఆయా బ్రాండ్లు స్వచ్ఛందంగా PFAS రహితంగా ప్రొడక్ట్స్ తయారుచేస్తే అందరికీ శ్రేయస్కరం’ అని నోట్రే డేమ్‌లోని భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ గ్రాహం పీస్లీ అన్నారు.