కొత్త కేసుల్లో సగం మహారాష్ట్ర నుంచే

78 జిల్లాల్లో రెండు వారాలుగా నో పాజిటివ్ దేశంలో 21,700కు చేరిన కేసుల సంఖ్య దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో దాదాపు సగం వరకు ఒక్క మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. ఇందులో సింహభాగం ముంబయి నగరం నుంచే నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద సుమారు 1410 కొత్త కేసులు నమోదుకాగా, వీటిలో 778 ఒక్క మహారాష్ట్రలోనే వెలుగుచూశాయి. ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం 6427 కేసుల్లో 4208 […]

Update: 2020-04-23 11:20 GMT

78 జిల్లాల్లో రెండు వారాలుగా నో పాజిటివ్
దేశంలో 21,700కు చేరిన కేసుల సంఖ్య

దిశ, న్యూస్ బ్యూరో:
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో దాదాపు సగం వరకు ఒక్క మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. ఇందులో సింహభాగం ముంబయి నగరం నుంచే నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద సుమారు 1410 కొత్త కేసులు నమోదుకాగా, వీటిలో 778 ఒక్క మహారాష్ట్రలోనే వెలుగుచూశాయి. ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం 6427 కేసుల్లో 4208 ముంబయి నగరంలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో మొత్తం 269 మంది కరోనా కారణంగా చనిపోతే ఇందులో ముంబయి నగరవాసులే 167 మంది ఉన్నారు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశం మొత్తం మీద 21,700 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇందులో 4,325 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం 686 మంది మృతిచెందగా ప్రస్తుతం యాక్టివ్ పేషెంట్లు 16,689 మంది ఉన్నట్లు పేర్కొంది. అయితే అనేక రాష్ట్రాల నుంచి అప్పటికి పూర్తి వివరాలు అందనందున మొత్తం గణాంకాల్లో తేడా ఏర్పడింది.

గత నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులోకి వచ్చే సమయానికి దేశంలో 19,974 మందికి 20,864 పరీక్షలు చేయగా 482 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. లాక్‌డౌన్ అమలులోకి వచ్చి నెలరోజులైన సందర్భంగా ఈ టెస్టుల సంఖ్య ఐదు లక్షలకు చేరుకుంది. పాజిటివ్‌గా తేలినవారి సంఖ్య (ఏప్రిల్ 23 ఉదయం 9.00 గం. సమయానికి) 21,797 అని ఐసీఎంఆర్ పేర్కొంటే కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ మాత్రం సాయంత్రం ఐదు గంటల వరకు 21,700 మంది మాత్రమే పాజిటివ్ పేషెంట్లు అని పేర్కొంది. 97 మంది పాజిటివ్ పేషెంట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. ఐసీఎంఆర్ కూడా కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ కిందనే పనిచేస్తోంది. రాష్ట్రాలవారీగా చూస్తే మహారాష్ట్రలో ఒక్క రోజు వ్యవదిలో 778 కొత్త పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఢిల్లీ నగరంలో 128, ఆంధ్రప్రదేశ్‌లో 80, తమిళనాడులో 54, తెలంగాణలో 27 చొప్పున నమోదయ్యాయి.

తెలంగాణకంటే పాజిటివ్ కేసుల పరంపర ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ఆలస్యంగా మొదలైనా మృతుల సంఖ్యలో మాత్రం తెలంగాణను అధిగమించింది. తెలంగాణలో ఇప్పటివరకు 25 మంది చనిపోగా ఆంధ్రప్రదేశ్‌లో ఇది 27గా ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో సైతం తెలంగాణ కంటే కేవలం 100 మాత్రమే తక్కువగా ఉంది. రికవరీ కూడా తెలంగాణ కంటే తక్కువగా ఉంది. కానీ రాపిడ్ టెస్టుల విషయంలో మాత్రం దేశంలో మరే రాష్ట్రం కంటే ఎక్కువగా చేస్తోంది.

భారత్ :

మొత్తం కేసులు : 21,700

మృతులు : 686

రికవరీ : 4,325

తెలంగాణ :

మొత్తం కేసులు : 970

మృతులు : 25

రికవరీ : 252

ఆంధ్రప్రదేశ్ :

మొత్తం కేసులు : 893

మృతులు : 27

రికవరీ : 141

Tags: Positive cases, Countrywide, Maharashtra, lockdown, Telangana, AP

Tags:    

Similar News