మానవత్వం అంటే ఏంటో.. వీరిని చూసి నేర్చుకోవాలి

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత సమాజంలో మానవత్వం కరువవుతుంది. ఎదుటివారు ఏమైపోయినా తమకెందుకు అంటూ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. చదువు, సంస్కారం, హోదా తో పాటు మానవత్వం ఉన్నా, దాన్ని మరుగున పడేస్తున్నారు. ఇక మనుషుల విషయంలోనే జాలి చూపని వారు మూగజీవాలమీద ప్రేమ ఎలా చూపుతారు.కానీ మానవత్వం చూపడానికి చిన్న, పెద్ద.. చదువు, సంధ్య ఉండనవసరం లేదని నిరూపించారు ఈ చిన్నారులు. పసిపిల్లలు దేవుడితో సమానమని పెద్దలు చెప్తుంటారు. ప్రస్తుతం ఈ ఫోటో చూస్తుంటే అది నిజమనిపిస్తుంది. […]

Update: 2021-03-24 04:57 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత సమాజంలో మానవత్వం కరువవుతుంది. ఎదుటివారు ఏమైపోయినా తమకెందుకు అంటూ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. చదువు, సంస్కారం, హోదా తో పాటు మానవత్వం ఉన్నా, దాన్ని మరుగున పడేస్తున్నారు. ఇక మనుషుల విషయంలోనే జాలి చూపని వారు మూగజీవాలమీద ప్రేమ ఎలా చూపుతారు.కానీ మానవత్వం చూపడానికి చిన్న, పెద్ద.. చదువు, సంధ్య ఉండనవసరం లేదని నిరూపించారు ఈ చిన్నారులు.

పసిపిల్లలు దేవుడితో సమానమని పెద్దలు చెప్తుంటారు. ప్రస్తుతం ఈ ఫోటో చూస్తుంటే అది నిజమనిపిస్తుంది. రోడ్డు మీద ఒక కుక్క గాయంతో బాధపడుతుంటే.. తట్టుకోలేని పసి హృదయాలు ఆ కుక్కను దగ్గరకు తీసుకొన్నారు. గాయమైన చోట బ్యాండేజ్ లు వేస్తూ ఇలా కెమెరా కంటికి కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మానవత్వం అంటే ఏంటో .. ఈ పిల్లలను చూసి నేర్చుకోవాలి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News