మోదీ ఫొటో ప్లేస్‌లో జాతీయ జెండా!
దిశ, ఫీచర్స్ : కొవిడ్ 19ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ‘వ్యాక్సినేషన్ డ్రైవ్’ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇండియా విషయానికొస్తే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊహించినంత వేగంగా కొనసాగనప్పటికీ వ్యాక్సిన్ వల్ల మెరుగైన ఫలితాలే వస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా టీకా సర్టిఫికెట్‌పై ప్రధాని మోడీ ఫొటోను ముద్రించడాన్ని కొందరు తప్పుపడితే, మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ టెకీ.. మోదీ ఫొటో ప్లేస్‌లో జాతీయజెండా వచ్చేట్లు ఓ కోడ్ రూపొందించాడు. వ్యాక్సినేషన్ కోసం […]
దిశ, ఫీచర్స్ : కొవిడ్ 19ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ‘వ్యాక్సినేషన్ డ్రైవ్’ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇండియా విషయానికొస్తే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊహించినంత వేగంగా కొనసాగనప్పటికీ వ్యాక్సిన్ వల్ల మెరుగైన ఫలితాలే వస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా టీకా సర్టిఫికెట్‌పై ప్రధాని మోడీ ఫొటోను ముద్రించడాన్ని కొందరు తప్పుపడితే, మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ టెకీ.. మోదీ ఫొటో ప్లేస్‌లో జాతీయజెండా వచ్చేట్లు ఓ కోడ్ రూపొందించాడు.
వ్యాక్సినేషన్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే టీకా వేయించుకున్న తర్వాత, తమ టీకా ధృవీకరణ పత్రాలను ఆన్‌లైన్(కోవిన్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా)లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉండగా, ఆ సర్టిఫికెట్ దిగువన మోదీ చిత్రం రావడం గమనించే ఉంటారు. ప్రస్తుతం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా ఓ కోడర్.. ప్రభుత్వం జారీ చేసిన టీకా సర్టిఫికెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించి, ఆ స్థానంలో జాతీయ జెండా వచ్చేలా ఓ కోడ్ సృష్టించాడు. r/ఇండియా ఫోరమ్‌లో @glorious_albus పేరున్న వినియోగదారుడు ఈ స్క్రిప్ట్‌ను రూపొందించాడు. అతను తన గిట్‌హబ్‌లో స్టెప్ బై స్టెప్ సూచనలతో పాటు స్క్రిప్ట్‌ను లిస్ట్ అవుట్ చేశాడు.
ప్రధాని మోదీ చిత్రం లేకుండా తాము డౌన్‌లోడ్ చేసిన వ్యాక్సిన్ సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయా? లేదా? అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘క్యూఆర్ కోడ్ డ్యామేజ్ కాకుండా ఉంది కనుక ఇది సిద్ధాంతపరంగా మంచిది. కానీ చెల్లుబాటువుతుందా? లేదా? అంటే దానికి నేను కచ్చితమైన సమాధానం చెప్పలేను’ అని ఓ రెడిట్ యూజర్ జవాబిచ్చాడు. ఒకవేళ మీరు ఈ సర్టిఫికెట్ కోసం ఆసక్తిగా ఉంటే, ప్రోగ్రామింగ్/కోడింగ్ ప్రాథమికాలను మీరు అర్థం చేసుకుంటే.. ఇక్కడ GitHub పేజీకి వెళ్ళవచ్చని అతడు పేర్కొన్నాడు.
ఇక జార్ఖండ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలు కూడా ఇటీవలే వ్యాక్సినేషన్ కార్డుపై మోదీ చిత్రాన్ని మార్చాయి. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్.. మోదీ చిత్రాన్ని తమ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో భర్తీ చేసిన రెండు రోజుల తరువాత, ఛత్తీస్‌గడ్ కూడా ఈ విధానాన్నే అనుసరించింది. ఈ మేరకు 18-44 ఏళ్ళ వయసు వారికి టీకాలు వేసినందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బగెల్ ఫొటోతో కూడిన సొంత ధృవీకరణ పత్రాన్ని విడుదల చేయడం ప్రారంభించింది.
‘భారత ప్రభుత్వం డబ్బును అందిస్తున్నప్పుడు, వారి సర్టిఫికెట్లపై ప్రధానమంత్రి ఫోటో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తున్నప్పుడు, వారు తమ సొంత టీకా ధృవీకరణ పత్రాలను ఎందుకు ఇవ్వకూడదు? టీకా సర్టిఫికెట్లపై పీఎం నరేంద్ర మోడీ ఫోటోనే ఎందుకు ఉండాలి’ అని ఛత్తీస్‌గడ్ ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ డియో అభిప్రాయపడ్డాడు. కొవిన్ యాప్ జారీ చేసిన టీకా సర్టిఫికెట్‌లో మోడీ ఛాయాచిత్రం ఉపయోగించడంపై కేంద్రం, కొన్ని రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్న కొన్ని వారాల తర్వాత ఈ చర్య వచ్చింది.