గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

దిశ, మెదక్: ప్రభుత్వం నిషేధించిన గుట్కాప్యాకెట్లను అమ్ముతున్న ఓ వ్యక్తిని సిద్దిపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణం సుభాష్ రోడ్‌లోని రాఘవేంద్ర జనరల్ స్టోర్లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..ప్రభుత్వ నిషేధిత టొబాకో ప్యాకెట్లు అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టు-టౌన్ సీఐ పరశురామ్ గౌడ్ తన సిబ్బందితో కలసి షాపుపై రైడ్ నిర్వహించారు. రూ. 4500విలువ చేసే 56 గుట్కా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకుని, షాపు యజమాని ఇరుకుల చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశారు. […]

Update: 2020-04-12 09:33 GMT

దిశ, మెదక్: ప్రభుత్వం నిషేధించిన గుట్కాప్యాకెట్లను అమ్ముతున్న ఓ వ్యక్తిని సిద్దిపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణం సుభాష్ రోడ్‌లోని రాఘవేంద్ర జనరల్ స్టోర్లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..ప్రభుత్వ నిషేధిత టొబాకో ప్యాకెట్లు అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టు-టౌన్ సీఐ పరశురామ్ గౌడ్ తన సిబ్బందితో కలసి షాపుపై రైడ్ నిర్వహించారు. రూ. 4500విలువ చేసే 56 గుట్కా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకుని, షాపు యజమాని ఇరుకుల చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిషేధించిన పొగాకు, గుట్కా, టొబాకో ప్యాకెట్లను అమ్మినా , వాటిని కలిగి ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

tags ; prohibited gutka, medak, handover by police

Tags:    

Similar News