నీట్ ఫలితాల్లో సత్తా చాటిన గురుకులాల విద్యార్థులు

దిశ, తెలంగాణ బ్యూరో : నీట్​ఫలితాల్లో గురుకుల విద్యార్ధులు హవా చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది విద్యార్ధులు మెడిసిన్‌లో ర్యాంక్​ సాధించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్​మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నైపుణ్యమున్న విద్యార్ధులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని అన్నారు. బి. తరుణ్ అనే విద్యార్థి 563 మార్కులతో అగ్రస్థానం సాధించడంతో పాటు మరో 23 మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించడం ఆనందాన్ని కలిగించిందన్నారు. వచ్చే ఏడాది వంద మంది విద్యార్ధులు […]

Update: 2021-11-02 10:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నీట్​ఫలితాల్లో గురుకుల విద్యార్ధులు హవా చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది విద్యార్ధులు మెడిసిన్‌లో ర్యాంక్​ సాధించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్​మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నైపుణ్యమున్న విద్యార్ధులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని అన్నారు.

బి. తరుణ్ అనే విద్యార్థి 563 మార్కులతో అగ్రస్థానం సాధించడంతో పాటు మరో 23 మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించడం ఆనందాన్ని కలిగించిందన్నారు. వచ్చే ఏడాది వంద మంది విద్యార్ధులు నీట్‌లో ర్యాంక్​ సాధించేలా శిక్షణ ఇస్తామన్నారు. ప్రతీ ఏడాది విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దితున్న ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీచర్లు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News