అప్పులు తెచ్చి.. అభివృద్ధి చేస్తే మమ్మల్ని రోడ్డున పడేస్తారా..?

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : అభివృద్ధి ప‌నుల‌ బిల్లులు చెల్లించ‌కుండా రాష్ట్ర ప్రభుత్వం స‌ర్పంచుల‌ను ముప్పుతిప్పలు పెడుతోంద‌ని ఎమ్మెల్యే వొడితెల స‌తీష్ ఎదుట గుంటూరుప‌ల్లి గ్రామ స‌ర్పంచ్ స‌మీప బంధువు హ‌న్మంత‌రావు పురుగుల మందు తాగేందుకు య‌త్నించం క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న శుక్రవామం వ‌రంగ‌ల్ అర్భన్ జిల్లా ఎల్కతుర్తి మండ‌ల కేంద్రంలో నిర్వహిస్తున్న షాదీముబార‌క్‌, క‌ళ్యాణ ల‌క్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకోవడం గ‌మ‌నార్హం. హ‌న్మంత‌రావు పురుగుల మందు తాగేందుకు య‌త్నిస్తుండ‌గా వెంట‌నే నాయ‌కులు అడ్డుకున్నారు. […]

Update: 2021-06-18 07:53 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : అభివృద్ధి ప‌నుల‌ బిల్లులు చెల్లించ‌కుండా రాష్ట్ర ప్రభుత్వం స‌ర్పంచుల‌ను ముప్పుతిప్పలు పెడుతోంద‌ని ఎమ్మెల్యే వొడితెల స‌తీష్ ఎదుట గుంటూరుప‌ల్లి గ్రామ స‌ర్పంచ్ స‌మీప బంధువు హ‌న్మంత‌రావు పురుగుల మందు తాగేందుకు య‌త్నించం క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న శుక్రవామం వ‌రంగ‌ల్ అర్భన్ జిల్లా ఎల్కతుర్తి మండ‌ల కేంద్రంలో నిర్వహిస్తున్న షాదీముబార‌క్‌, క‌ళ్యాణ ల‌క్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకోవడం గ‌మ‌నార్హం. హ‌న్మంత‌రావు పురుగుల మందు తాగేందుకు య‌త్నిస్తుండ‌గా వెంట‌నే నాయ‌కులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో నాయ‌కుల ఎదుట హ‌న్మంత‌రావు తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేశాడు. గ్రామాభివృద్ధి కోస‌మ‌ని స‌ర్పంచ్‌, తాను ల‌క్షల రూపాయాల‌తో ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, సీసీ రోడ్లు, ఇంకుడు గుంతల పనులు చేశామని ఆవేద‌న వ్యక్తం చేశాడు. ఇంత చేసినా ఏళ్లకు ఏళ్లు బిల్లుల కోసం ఆగాల్సి వ‌స్తోంద‌ని, తెచ్చిన అప్పుల‌కు వ‌డ్డీలే ఎక్కువ‌గా క‌ట్టాల్సి వ‌స్తోంద‌ని వాపోయారు. అప్పులు తెచ్చి పనులు చేస్తే.. బిల్లులు చెల్లించ‌కుండా త‌మ‌ను రోడ్డున ప‌డేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇదిలాఉండ‌గా స‌ర్ది చెప్పడ‌మో..! ఓదార్చాడ‌మో చేయాల్సిన ఎమ్మెల్యే స‌తీష్‌కుమార్‌.. బిల్లులు లేటయితే ఆగమాగం ఎందుకు అవుతున్నారు.. అంత‌ ఓపిక లేనేళ్లు పనులెందుకు చేయాలే అంటూ ఎదురు ప్రశ్నించ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News