ఒక అక్రమ సంబంధం.. రెండు హత్యలు

దిశ, వెబ్ డెస్క్: అక్రమ సంబంధం నేపథ్యంలో జరిగిన హత్యకేసును గుంటూరు అర్బన్ పోలీసులు ఛేదించారు. మంగళగిరి మండలం నవులూరుకు చెందిన పారబత్తిన సీతారామాంజనేయులు హత్యకు గురయ్యారు. కాగా ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు నిర్దారించారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…మృతుడి భార్య లక్ష్మికి, అతని సోదరుడు దుర్గా ప్రసన్నతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వీరు తోడేటి నాగరాజు, పసుపులేటి హరికృష్ణలతో కలిసి హత్య చేశారు. సమాచారం అందుకున్న […]

Update: 2020-09-02 07:03 GMT

దిశ, వెబ్ డెస్క్: అక్రమ సంబంధం నేపథ్యంలో జరిగిన హత్యకేసును గుంటూరు అర్బన్ పోలీసులు ఛేదించారు. మంగళగిరి మండలం నవులూరుకు చెందిన పారబత్తిన సీతారామాంజనేయులు హత్యకు గురయ్యారు. కాగా ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు నిర్దారించారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…మృతుడి భార్య లక్ష్మికి, అతని సోదరుడు దుర్గా ప్రసన్నతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వీరు తోడేటి నాగరాజు, పసుపులేటి హరికృష్ణలతో కలిసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తోడేటి నాగరాజు మరో హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. పిడుగురాళ్లకు చెందిన చిన్నా అనే వ్యక్తిని నాగరాజు గుంటూరు ఆర్డీవో ఆఫీసు కార్యాలయం సమీపంలో ఓ గదిలో కొట్టి చంపినట్టు పోలీసులు నిర్దారించారు. హత్య కేసులో ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులకు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి రివార్డులు అందజేశారు.

Tags:    

Similar News