గుడిసెల్లో ఉంటే సచ్చిపోయేలా ఉన్నాం..‘డబుల్ ఇళ్లు’ ఇయ్యుండి సారూ..!

దిశ, కామారెడ్డి : ‘సారూ.. మీకు దండం పెడుతం.. మాకు డబుల్ బెడ్ రూమ్ ఇయ్యండి.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ఎన్నికల్లో చెప్పిండ్రు కదా.. గిప్పుడు పడుతున్న వానలకు గుడిసెల్లో ఉండలేకపోతున్నాం. మా పిల్లలు సచ్చిపోయేలా ఉన్నారు. ఎన్నిసార్లయినా.. మీకే ఓటేసినం కదా సారూ. మళ్ళీ మీకే ఓటేస్తాం. మాకు ఇల్లు ఇయ్యుండ్రి.. ఇప్పటికీ పట్టించుకోకపోతే కాంగ్రెస్‌కు ఓటేస్తాం.. మాకు ఎవరు అండగా ఉంటే వాళ్ళకే ఓటేస్తాం. మాచారెడ్డి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ […]

Update: 2021-09-05 03:39 GMT

దిశ, కామారెడ్డి : ‘సారూ.. మీకు దండం పెడుతం.. మాకు డబుల్ బెడ్ రూమ్ ఇయ్యండి.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ఎన్నికల్లో చెప్పిండ్రు కదా.. గిప్పుడు పడుతున్న వానలకు గుడిసెల్లో ఉండలేకపోతున్నాం. మా పిల్లలు సచ్చిపోయేలా ఉన్నారు. ఎన్నిసార్లయినా.. మీకే ఓటేసినం కదా సారూ. మళ్ళీ మీకే ఓటేస్తాం. మాకు ఇల్లు ఇయ్యుండ్రి.. ఇప్పటికీ పట్టించుకోకపోతే కాంగ్రెస్‌కు ఓటేస్తాం.. మాకు ఎవరు అండగా ఉంటే వాళ్ళకే ఓటేస్తాం. మాచారెడ్డి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గుంటి తండా గిరిజనుల ఆవేదన ఇది. గతవారం రోజులుగా నిర్విరామంగా వర్షాలు కురుస్తుండటంతో తండా వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం కొన్ని వీడియోలు తీసి వాటి ద్వారా తండా వాసులు తమ బాధలను వివరించారు. తండాలో సరైన రోడ్లు లేవని, వారం రోజులుగా వర్షాలు పడుతుండటంతో గుడిసెలు కూలిపోతున్నాయి. భారీ వర్షాలకు కూలిన గుడిసెల్లో నివాసం ఉంటున్నాం. ఇద్దరు పిల్లలకు కూడా దెబ్బలు తాకినాయి. ఆస్పత్రికి పంపించాం. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికలు వస్తే ఓట్లడగడానికి మాత్రం వస్తారు. వర్షాలు కురిసి గుడిసెలు కూలిపోతే మాత్రం ఒక్కరూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తండాకు ఎవరు వచ్చినా సపోర్టు చేసినం. ఓటేసి గెలిపించినం. మమ్మల్ని మాత్రం గాలికి వదిలేశారు. మళ్ళీ ఎన్నికలు వస్తేనే వస్తారేమో అని వాపోయారు.

నా భార్య చనిపోయేది..

నెల రోజుల కిందట నా గుడిసె కూలిపోయింది. కాస్తయితే నా భార్య చనిపోయేది. గుడిసె చూడటానికి రమ్మని ఎన్నిసార్లు ఫొన్ చేసినా పట్టించుకోలేదు. ఏడుస్తున్నా.. ఎవరు పట్టించుకోలేదు. ఓట్లు అడగడానికైతే వస్తారు. కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. గుంటి తండాను పట్టించుకునే వారే కరువయ్యారు.

-గోపాల్, తండా వాసి

గుడిసెలలో సహవాసం చేస్తున్నాం..

కూలిపోయే గుడిసెల్లో ఉంటూ సహవాసం చేస్తున్నాం. మాకు ఏమి ఇవ్వకున్నా సరే.. ఉండటానికి ఇల్లు మాత్రం ఇవ్వండి. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీపీ నర్సింగరావు వచ్చారు. ఇండ్లు అడిగితే సరే సరే.. అంటూ వెళ్లిపోయారు. గెలిపించినం. ఇప్పటికీ రావడం లేదు.

-మాలోత్ రేన, తండా వాసి

నా కొడుకు సచ్చిపోయేవాడు..

నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక్కడే కొడుకు ఉన్నాడు. నా ఇల్లు కూలిపోయింది. బీరువా కింద నా కొడుకు ఉండిపోయాడు. నా మరిది వచ్చి బీరువా తీసేయకపోతే నా కొడుకు సచ్చిపోయేవాడు. నా కొడుకు సచ్చిపోతే నేను బతికేది ఎవరి కోసం. వీళ్ళను గెలిపించింది ఇందుకేనా.. ఇప్పుడు వస్తే గళ్ళ పట్టి గుంజి అడుగుతం. మేము లేనిది వాళ్ళు ఎక్కడ ఉండేవారు. మేము సపోర్టు చేస్తేనే కదా వాళ్ళు గెలిచింది.

-లక్ష్మీ, తండా వాసి

Tags:    

Similar News