అది నిరూపిస్తే అంబేద్కర్ సెంటర్‌లో ఊరేసుకుంటా? బీజేపీ నేత సవాల్
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో దళితబంధును ఆపాలని పేర్కొన్నట్లు టీఆర్ఎస్ నాయకులు నిరూపిస్తే హుజురాబాద్ లోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉరి వేసుకోవటానికి సిద్ధమని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రకటించారు. దురుద్దేశ పూర్వకంగానే దళిత బంధును నిలిపివేసిన సీఎం కేసీఆర్ ..దళితులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఉప ఎన్నికల ఇంచార్జ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి […]
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో దళితబంధును ఆపాలని పేర్కొన్నట్లు టీఆర్ఎస్ నాయకులు నిరూపిస్తే హుజురాబాద్ లోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉరి వేసుకోవటానికి సిద్ధమని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రకటించారు. దురుద్దేశ పూర్వకంగానే దళిత బంధును నిలిపివేసిన సీఎం కేసీఆర్ ..దళితులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఉప ఎన్నికల ఇంచార్జ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నాయకత్వంలో మంగళవారం హుజురాబాద్ ఎన్నికల అధికారికి మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, రమేష్ రాథోడ్, కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి బృందం దళిత బంధును హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ నెల 7న బీజేపీ ఇచ్చిన వినతిపత్రంలో దళితబంధు ఇవ్వొద్దని పేర్కొనలేదన్నారు. అర్హులైన వారికి దళిత బంధు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులను కోరామని, అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఆపారని ఆరోపించారు. గత నాలుగు నెలలుగా దళిత బంధును అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని తెలిపారు.