ఖైదీ.. డిగ్రీ నెంబర్ 31

దిశ, వెబ్‌డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నెం.1’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ జైలులో ఖైదీగా ఉంటూ, అక్కడి నుంచే కాలేజీకి వెళ్తుంటాడు. అలా చదువుకొని చివరకు లాయర్‌ పట్టా సాధిస్తాడు. ఇది రీల్ స్టోరీ. కాగా గుజరాత్‌లో అచ్చం ఇలాంటి రియల్ స్టోరీ ఒకటి జరిగింది. అయితే ఆ ఖైదీ ఒక్క డిగ్రీతోనే ఆగిపోలేదు. జైలులో ఉన్న ఎనిమిదేళ్ల కాలంలో డిగ్రీల మీద డిగ్రీలు పొందాడు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాన్ని […]

Update: 2020-11-10 03:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నెం.1’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ జైలులో ఖైదీగా ఉంటూ, అక్కడి నుంచే కాలేజీకి వెళ్తుంటాడు. అలా చదువుకొని చివరకు లాయర్‌ పట్టా సాధిస్తాడు. ఇది రీల్ స్టోరీ. కాగా గుజరాత్‌లో అచ్చం ఇలాంటి రియల్ స్టోరీ ఒకటి జరిగింది. అయితే ఆ ఖైదీ ఒక్క డిగ్రీతోనే ఆగిపోలేదు. జైలులో ఉన్న ఎనిమిదేళ్ల కాలంలో డిగ్రీల మీద డిగ్రీలు పొందాడు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సంపాదించి, తోటి ఖైదీలకు ఆదర్శంగా నిలిచాడు.

గుజరాత్, భావ్‌నగర్‌కు చెందిన భానుభాయ్ పటేల్.. ఖైదీ నుంచి స్ఫూర్తివంతమైన వ్యక్తిగా మారాడు. అసలు విషయానికొస్తే.. అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ నుంచి 1992లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన భాను.. ఆ తర్వాత పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ తన స్నేహితుడొకరు స్టూడెంట్ వీసాతో ఉద్యోగం చేస్తూ, తన జీతాన్ని భాను అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ రెగ్యులేషన్ యాక్ట్(ఫెరా)చట్టం ఉల్లంఘన కింద భానుకు 10 ఏళ్ల జైలుశిక్ష విధించిన అధికారులు, కొన్నాళ్లకు తనను అహ్మదాబాద్ జైలుకు తరలించారు. అలా జైల్లో ఖైదీగా ఉంటూనే మొత్తంగా 31 డిగ్రీ పట్టాలు సాధించాడు భాను. తను జైలు నుంచి విడుదలయ్యాక అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. నిజానికి జైలుకు వెళ్లిన వారికి ప్రభుత్వ ఉద్యోగం రాదు. కానీ భానూభాయ్ డిగ్రీలు చూసి, యూవర్సిటీలో ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగంలో చేరాక కూడా భానూభాయ్ తన చదువును కొనసాగిస్తూ మొత్తంగా ఐదేళ్లకాలంలో మరో 23 డిగ్రీలు పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 54 డిగ్రీలు సంపాదించాడు.

కాగా గుజరాతీ, హిందీ, ఆంగ్ల భాషల్లో మూడు పుస్తకాలు కూడా రాసిన భాను.. 13వ అసెంబ్లీ ఎన్నికల కాలంలో ప్రిసైడింగ్ అధికారిగానూ పని చేశాడు. ప్రస్తుతం ఆయన వయసు 65. అయినా ఇప్పటికీ మరిన్ని డిగ్రీలు సాధించాలనే పట్టుదలతో ఉన్నానని చెబుతున్నాడు. భానుభాయ్ తను పొందిన డిగ్రీ పట్టాలతో ‘లిమ్కా బుక్, ఆసియా బుక్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించాడు. వాటితో పాటు మరెన్నో రికార్డులు ఆయన పేరిట ఉండటం విశేషం.

Tags:    

Similar News