గుజరాత్ : రెడ్ జోన్‌లో కఠినం.. గ్రీన్ జోన్‌లో అదనంగా మినహాయింపులు
గాంధీనగర్: మూడో దశ లాక్‌డౌన్ కాలంలో రెడ్ జోన్‌లలో కఠిన ఆంక్షలను అమలు చేయనున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లలో అదనంగా కొన్ని సడలింపులను ఇవ్వనున్నట్టు పేర్కొంది. రెడ్ జోన్‌లుగా గుర్తించిన అహ్మదాబాద్, సూరత్, వడోదర, గాంధీనగర్, భావ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లలో కఠిన ఆంక్షలుంటాయని సీఎం సెక్రెటరీ అశ్వనీ కుమార్ తెలిపారు. అయితే, రాజ్‌కోటి సిటీ ఆరెంజ్ జోన్‌లో ఉన్నప్పటికీ.. రెడ్ జోన్‌లో అమలు చేసే నిబంధనలనే అమలు చేస్తామని చెప్పారు. ప్రజల […]
గాంధీనగర్: మూడో దశ లాక్‌డౌన్ కాలంలో రెడ్ జోన్‌లలో కఠిన ఆంక్షలను అమలు చేయనున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లలో అదనంగా కొన్ని సడలింపులను ఇవ్వనున్నట్టు పేర్కొంది. రెడ్ జోన్‌లుగా గుర్తించిన అహ్మదాబాద్, సూరత్, వడోదర, గాంధీనగర్, భావ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లలో కఠిన ఆంక్షలుంటాయని సీఎం సెక్రెటరీ అశ్వనీ కుమార్ తెలిపారు. అయితే, రాజ్‌కోటి సిటీ ఆరెంజ్ జోన్‌లో ఉన్నప్పటికీ.. రెడ్ జోన్‌లో అమలు చేసే నిబంధనలనే అమలు చేస్తామని చెప్పారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. అలాగే, రెడ్ జోన్‌లుగా గుర్తించిన ఆరు మున్సిపాలిటీలలోనూ కఠిన నిబంధనలుంటాయని వెల్లడించారు. అలాగే, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లలో సెలూన్, బ్యూటీ పార్లర్‌లు, టీ స్టాళ్లు, క్యాబ్‌లకు గుజరాత్ సర్కారు అనుమతినిస్తున్నది. గ్రీన్ జోన్‌లలో 50శాతం మంది ప్రయాణికులతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్‌టీసీలను నడుపనున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయాలను సర్కారు ప్రకటించింది.
tags: gujarat, lockdown, relaxation, zones, strict, allow