డియర్ శౌర్య.. నీ టాలెంట్ అభినందనీయం.. సీఎం లేఖ
దిశ, ఫీచర్స్ : ఆకాశ వీధిలో చుక్కలు చూస్తూ పడుకునే ‘బాల్య’ జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఉంటాయి. చంద్రుడు, చుక్కలు, సూర్యుడు, పాలపుంత, గ్రహాలు.. ఇవన్నీ మనకో వింత. చిన్నారుల నుంచి పెద్దోళ్ల వరకు చాలామంది ఈ ‘అంతరిక్ష’ ఊహల్లో విహరిస్తుంటారు. కాగా అహ్మదాబాద్‌కు చెందిన 5వ తరగతి విద్యార్థి శౌర్య మిశ్రాకు కూడా స్పేస్‌పై మక్కువ ఎక్కువ. కానీ శౌర్య అందరిలా కేవలం ఆలోచనలు, ఇమాజినేషన్‌తోనే సరిపెట్టుకోలేదు. వాటికి అక్షర రూపమిస్తూ ‘స్పేస్ […]
దిశ, ఫీచర్స్ : ఆకాశ వీధిలో చుక్కలు చూస్తూ పడుకునే ‘బాల్య’ జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఉంటాయి. చంద్రుడు, చుక్కలు, సూర్యుడు, పాలపుంత, గ్రహాలు.. ఇవన్నీ మనకో వింత. చిన్నారుల నుంచి పెద్దోళ్ల వరకు చాలామంది ఈ ‘అంతరిక్ష’ ఊహల్లో విహరిస్తుంటారు. కాగా అహ్మదాబాద్‌కు చెందిన 5వ తరగతి విద్యార్థి శౌర్య మిశ్రాకు కూడా స్పేస్‌పై మక్కువ ఎక్కువ. కానీ శౌర్య అందరిలా కేవలం ఆలోచనలు, ఇమాజినేషన్‌తోనే సరిపెట్టుకోలేదు. వాటికి అక్షర రూపమిస్తూ ‘స్పేస్ మాఫియా ఆన్ ది లూస్’ పేరుతో సైన్స్ ఫిక్షన్ బుక్ రాశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న గుజరాజ్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శౌర్యను అభినందిస్తూ లేఖ రాశాడు.
డియర్ శౌర్య.. గోళీలు, కర్ర బిళ్ల ఆడే వయసులో రచయిత కావాలని నిశ్చయించుకోవడం నిజంగా అభినందనీయం. లాక్‌డౌన్ బోరింగ్ సమయంలో చాలా ధైర్యంగా, అద్భుతమైన ఊహాశక్తితో, నీకు మాత్రమే సొంతమైన కమిట్‌మెంట్‌తో పుస్తకాన్ని పూర్తిచేశావు. కొవిడ్ మహమ్మారి విజృంభించిన విపత్కర పరిస్థితుల్లో.. నీ సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికి తీశావు. నీ అచీవ్‌మెంట్‌తో మేమంతా గర్విస్తున్నాం. సైన్స్ ఫిక్షన్‌లో యంగెస్ట్ ఆథర్‌గా నీ తోటి వయసు పిల్లలకు స్ఫూర్తిగా నిలిచావు. అమ్మానాన్న, గురువుల అడుగుజాడల్లో.. నీ భవిష్యత్తు అద్భుతంగా సాగాలని, నీ కెరీర్ ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ – విజయ్ రూపానీ, గుజరాత్ సీఎం
బీహార్‌లో పుట్టి పెరిగిన 11 ఏళ్ల శౌర్య మిశ్రా.. ప్రస్తుతం తన పేరెంట్స్‌తో కలిసి అహ్మదాబాద్‌లో ఉంటూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఐదోతరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్ కాలంలో.. స్పేస్‌బుక్స్ చదవడంతో పాటు వాటికి సంబంధించిన డాక్యుమెంటరీస్, చానల్స్ చూసేవాడు. ఆ సమయంలో తనకు వచ్చిన ఆలోచనలను అక్షరీకరించగా, అమ్మనాన్నల ప్రోత్సాహంతో దాన్ని పుస్తకంగా తీసుకువచ్చాడు. ఈ బుక్‌లో స్పేస్, ఎడ్వెంచర్స్, ప్లానెట్ దొంగతనాలు వంటి అంశాలుండగా, పుస్తకానికి మంచి పేరొచ్చింది.