కరోనా అనుమానితులకు సూచనలు
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. మనుషుల నుంచి మనుషులకే ప్రత్యక్షంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ పాటించాలని సూచించింది. అంటే ఇతర దేశాల నుంచి భారత దేశానికి వచ్చిన వారు 14 రోజులు పాటు ఇంట్లోనే ఉండాలి. కరోనా ప్రభలుతున్న నేపథ్యంలో అందరికీ ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందించడం […]
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. మనుషుల నుంచి మనుషులకే ప్రత్యక్షంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ పాటించాలని సూచించింది. అంటే ఇతర దేశాల నుంచి భారత దేశానికి వచ్చిన వారు 14 రోజులు పాటు ఇంట్లోనే ఉండాలి. కరోనా ప్రభలుతున్న నేపథ్యంలో అందరికీ ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందించడం సులువుకాదని భావించిన కేంద్ర ప్రభుత్వం.. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారు 14 రోజుల పాటు స్వీయ నిర్బంధం చేసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించిన పలు సూచనలు, జాగ్రత్తలు ఓ ప్రకటనలో విడుదల చేసింది.
హోమ్ క్వారంటైన్‌ల కోసం మార్గదర్శకాలు:
* కరోనా అనుమానిత వ్యక్తికి సంబంధించిన కుటుంబీకులు, పరిచయస్తులకు హోమ్ క్వారంటైన్ వర్తిస్తుంది.
* కరోనా అనుమానిత కేసును ప్రభుత్వ నిఘా బృందం 14 రోజుల పాటు సందర్శించడం మరియు పర్యవేక్షించడం జరుగుతుంది.
స్వీయనిర్బంధితులకు సూచనలు:
* వ్యక్తిని బాగా వెంటిలేషన్ చేసిన ఒకే గదిలో ఉంచాలి. అతడి గదికి తరచూ ఎవరు వెళ్లకూడదు. అలాగే కరోనా అనుమానితుడి కోసం ఆరోగ్యంతో ఉన్న వ్యక్తిని సహాయంగా కేటాయించండి. అతడితో పాటు ఒక్కరు మాత్రమే సేవకులుగా ఉంటే మంచిది.
* గృహ సభ్యులు కూడా వేరే రూమ్‌లో ఉంటే మంచింది. లేకుంటే కనీసం కరోనా అనుమానితుడికి 1 మీటర్ దూరంలో ఉండాలి. ఎల్లాప్పుడు వైద్యులు సూచించిన మాస్క్‌ను ధరించాలి.
* మాస్క్‌లను తీసివేసిన వెంటనే శుభ్రం చేయాలి.. లేదా వెంటనే మార్చాలి. కనీసం 6 గంటలకు ఒక మాస్కు వాడటం మేలు.. అనంతరం చేతిని శుభ్రంగా కడగాలి.
* చేతి పరిశుభ్రత కూడా అతి ముఖ్యం- నిర్బంధిత వ్యక్తికి సేవ చేసే వారు వారి చేతులను తరుచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
* వీలైనంత వరకు తాత్కాలిక టవల్స్ వాడటం మంచింది. లేదంటే ప్రత్యేకమైన గుడ్డ తువ్వాలు వాడాలి. నిర్బంధితుడు వాడిన తువ్వాళను డిటర్జెంట్‌తో వాష్ చేయాలి. ఇలా రోజు చేయాలి.
* దగ్గు, తుమ్ము చేసే సమయంలో కూడా ప్రత్యేకంగా ఒక బట్టను వినియోగించాలి. అనంతరం దానికి కూడా వాష్ చేయాలి. ఆ తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి.
*మలం, మూత్ర విసర్జనలు చేసేటప్పుడు చేతి గ్లౌజ్‌లు వినియోగించాలి. నోటికి ఎల్లాప్పుడూ మాస్క్ ధరించే ఉండాలి.
* లక్షణాలు తగ్గే వరకు చికిత్స పరమైన చర్యలు తీసుకోవాలి.
* నిర్బంధ వ్యక్తి ఉండే పడక గది, అతడు ఉపయోగించే ఇతన సామాగ్రిని కూడా శుభ్రం చేయాలి. స్నానపు గది, టాయిలెట్స్‌లను తరచూ శుభ్రం చేసి క్రిమిసంహారకం చేయాలి.
* 14 రోజులు పాటు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన తర్వాత కూడా ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
Tags: Guidelines, Home Quarantine, carona suspects, References