ఈ చిత్రంలో ఎన్ని పులులో ఉన్నాయో చెప్పుకోండి చూద్దాం?
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో చాలెంజ్‌ల పర్వం నడుస్తూనే ఉంది. అయితే.. అందుకు భిన్నంగా బ్రెయిన్ పజిల్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. అయితే అదేం కొత్త ప్రశ్న కాదు. అంతకుముందు అలాంటి బ్రెయిన్ పజిల్స్ నెట్టింట్లో కామన్‌గానే కనిపిస్తుంటాయి. అందులో నెటిజన్లు ఎక్కువగా మ్యాథ్స్ పజిల్స్ అడుగుతుంటాచరు. అయితే ఈ సారి ఓ ఫొటోలో ఎన్ని పులులు ఉన్నాయో చెప్పమంటూ ఓ నెజిటన్ ట్విటర్ లో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్‌గా మారింది. బిగ్ […]
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో చాలెంజ్‌ల పర్వం నడుస్తూనే ఉంది. అయితే.. అందుకు భిన్నంగా బ్రెయిన్ పజిల్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. అయితే అదేం కొత్త ప్రశ్న కాదు. అంతకుముందు అలాంటి బ్రెయిన్ పజిల్స్ నెట్టింట్లో కామన్‌గానే కనిపిస్తుంటాయి. అందులో నెటిజన్లు ఎక్కువగా మ్యాథ్స్ పజిల్స్ అడుగుతుంటాచరు. అయితే ఈ సారి ఓ ఫొటోలో ఎన్ని పులులు ఉన్నాయో చెప్పమంటూ ఓ నెజిటన్ ట్విటర్ లో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్‌గా మారింది. బిగ్ బి అమితా బచ్చన్ కూడా దానికి సమాధానం ఇచ్చాడు.
లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇంట్లోనే ఉండటంతో నెట్టింట్లో కాస్త ఎక్కువసేపే స్పెండ్ చేస్తున్నారు. దాంతో ఆయా వేదికల్లో చిన్న, చిన్న పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో మెదడుకు పదును పెట్టే ప్రశ్నలకు కొదవేం ఉండదు. రోజులో 100 పోస్టుల్లో రెండు మూడు తప్పక అలాంటివి ఉంటాయి. తాజాగా అలాంటి ఓ ఛాలెంజ్ మళ్లీ నెటిజన్ల బుర్రకు పదును పెడుతోంది. ఒక ఫొటోలో మనకు చూడగానే నాలుగు పులులు కనిపిస్తాయి. అయితే పరిసరాల్లోనే కలిసిపోతూ.. మరికొన్ని పులులు దాగున్నాయి. అలా ఆ ఫోటోలో మొత్తంగా ఎన్ని పులులు ఉన్నాయో చెప్పుకోండి చూద్దామంటూ ఈఎఫ్ నీర్ అనే నెటిజన్ ప్రశ్న సంధించాడు. అది కాస్త వైరల్ అయ్యింది. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ దానికి 11 అని సమధానమిచ్చారు. అమితాబ్ తో పాటు మరికొందరు సెలబ్రెటీలో కూడా ఆ బాబితాలో ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్ దియా మిర్జా, సోఫీ చౌదరీలు 16, హీరో టైగర్ ష్రాఫ్ 17, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ 17 అని సమాధానమిచ్చారు. చాలామంది 14, 16,17 అనే సమాధానాలిచ్చారు. కొంతమంది ఆ ఫోటోపై పులులు ఎక్కడెక్కడున్నాయో మార్క్ చేసి మరి పోస్ట్ చేస్తున్నారు. సో మీరు ఓసారి ట్రై చేయండి.
Tags : tigers, twitter trend, big b amita bacchan, nidhi agarwal, how many tigers