ఐడియా సూపర్.. పెళ్లిలో కట్నంగా ఎద్దులు
దిశ, అదిలాబాద్: ఆడబిడ్డ పెళ్లీడుకు రాగానే..ఏ గ్రామంలో అబ్బాయి ఉన్నాడు.. ఏం చదువుకున్నాడు.. వ్యవసాయ భూమి ఏమైనా ఉందా.. ఉద్యోగం చేస్తున్నాడా..అనే వివరాలను తెలుసుకుంటారు. వరుడి స్టేటస్‌ని బట్టి వధువు కుటుంబ సభ్యులు కట్న కానుకలు ఇస్తారు. కట్నంగా డబ్బులు, కార్లు, బైక్‌లు లాంటివి ఇస్తూ ఉంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వధువు తల్లిదండ్రులు వరుడికి ఎద్దులను కట్నంగా ఇచ్చి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని […]
దిశ, అదిలాబాద్: ఆడబిడ్డ పెళ్లీడుకు రాగానే..ఏ గ్రామంలో అబ్బాయి ఉన్నాడు.. ఏం చదువుకున్నాడు.. వ్యవసాయ భూమి ఏమైనా ఉందా.. ఉద్యోగం చేస్తున్నాడా..అనే వివరాలను తెలుసుకుంటారు. వరుడి స్టేటస్‌ని బట్టి వధువు కుటుంబ సభ్యులు కట్న కానుకలు ఇస్తారు. కట్నంగా డబ్బులు, కార్లు, బైక్‌లు లాంటివి ఇస్తూ ఉంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వధువు తల్లిదండ్రులు వరుడికి ఎద్దులను కట్నంగా ఇచ్చి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.
ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం వైజాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం సంగీతను అదిలాబాద్ మండలం ఛిచూధర్ ఖానాపూర్ గ్రామానికి చెందిన నైతం ప్రభుతో వివాహం నిశ్చయించారు. మంగళవారం వరుడి స్వగృహంలో పెళ్లి జరగ్గా.. వరుడికి అత్తింటివారు ఎడ్లను కట్నంగా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిని చూసి పెళ్లికి వచ్చినవారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానికంగా ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆదివాసీ గిరిజనుల జీవనమే పోడు వ్యవసాయమని, సంస్కృతి సాంప్రయాదాయాలను రక్షించుకోవడంలో భాగంగానే వరుడికి ఎద్దులను కట్నంగా ఇచ్చినట్లు వధువు తల్లిదండ్రులు చెబుతున్నారు.