ఘనంగా టీపీటీఎఫ్ ఆవిర్భావ వేడుకలు

దిశ, నిజామబాద్: టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అధ్యక్షులు దేవి సింగ్ టీపీటీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవి సింగ్ మాట్లాడుతూ టీపీటీఎఫ్, ఏపీటీఎఫ్ అనేక పోరాటాలు చేసి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శ్రమించయన్నారు. కరోనా కాలంలో ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలన్నారు. ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ జిల్లాలో టీపీటీఎఫ్ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, ఉపాధ్యాయ సమస్యలతో పాటు, సామాజిక […]

Update: 2020-05-29 03:18 GMT

దిశ, నిజామబాద్: టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అధ్యక్షులు దేవి సింగ్ టీపీటీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవి సింగ్ మాట్లాడుతూ టీపీటీఎఫ్, ఏపీటీఎఫ్ అనేక పోరాటాలు చేసి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శ్రమించయన్నారు. కరోనా కాలంలో ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలన్నారు. ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ జిల్లాలో టీపీటీఎఫ్ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, ఉపాధ్యాయ సమస్యలతో పాటు, సామాజిక సమస్యలు కూడా పరిష్కరించే విధంగా ఉపాధ్యాయులు ముందు తీసుకురావాలని కోరారు. ఈ వేడుకల్లో సల్ల సత్యనారాయణ, వెంకట్రావు, చంద్రశేఖర్, చందర్, డియల్ స్వామి, లింబయ్య, అరవింద్, షేక్ ఫరూక్, పవన్ కుమార్, గిరీష్, అనిల్ కుమార్, హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News