గజం రూ.లక్ష.. ఆ భూములకు మహా డిమాండ్
దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) గురువారం ఉప్పల్ భగాయత్ భూముల విక్రయానికి ఈ- వేలం నిర్వహించింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగిన ఈ ఆన్ లైన్ వేలంలో భగాయత్ భూములు భూం భూం అన్పించాయి. కనిష్ట ధర గజానికి రూ.35వేలుగా హెచ్ఎండీఏ నిర్ణయించగా, ఈ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు బిడ్డర్లు ఒక్కో గజానికి కనిష్టంగా రూ.77వేలు, గరిష్టంగా లక్షా వెయ్యి రూపాయల వరకు […]
దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) గురువారం ఉప్పల్ భగాయత్ భూముల విక్రయానికి ఈ- వేలం నిర్వహించింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగిన ఈ ఆన్ లైన్ వేలంలో భగాయత్ భూములు భూం భూం అన్పించాయి. కనిష్ట ధర గజానికి రూ.35వేలుగా హెచ్ఎండీఏ నిర్ణయించగా, ఈ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు బిడ్డర్లు ఒక్కో గజానికి కనిష్టంగా రూ.77వేలు, గరిష్టంగా లక్షా వెయ్యి రూపాయల వరకు ప్లాట్ల సైజులను బట్టి ధర పలికారు. కనిష్టంగా 150 గజాలు మొదలుకుని గరిష్టంగా 1787 గజాల వరకు వివిధ సైజుల్లో ఉన్న ప్లాట్లకు ఈ- వేలంను ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు నిర్వహించారు. ఈ సెషన్ లో రూ.97 కోట్ల 27లక్షల 5 వేల వరకు ఆదాయం వచ్చినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఆ తర్వాత నిర్వహించిన సెషన్ లో ఒక్కో గజానికి కనిష్టంగా రూ.53వేలు పలకగా, గరిష్టంగా రూ. 71వేల 815 ధర పలికినట్లు తెలిపారు. ఈ సెషన్ లో హెచ్ఎండీఏకు ఆదాయం రూ. 44 కోట్ల 34 లక్షల 25 వేల వరకు వచ్చినట్లు వెల్లడించారు.
ఈ వేలం తుది దశకు చేరే సమయానికి ఒక్కో గజం స్థలానికి కనిష్టంగా రూ. 53వేల ధర పలకగా, గరిష్టంగా రూ. లక్షా వెయ్యి రూపాయలు పలకటంతో ఈ-వేలం నిర్వహించిన గురవారం మొదటి రోజు 19వేల 719 చదరపు గజాల్లో ఉన్న మొత్తం 23 ప్లాట్లను విక్రయించిన హెచ్ఎండీఏకు రూ. 141 కోట్ల 61లక్షల 30 వేల వరకు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉప్పల్ భగాయత్ లే అవుట్ లోని మొత్తం 44 ప్లాట్లను విక్రయించాలని భావించిన అధికారులు తొలి రోజున 23 ప్లాట్లను విక్రయించగా శుక్రవారం ఇదే తరహాలో మరో 21 ప్లాట్ల అదే రూ. 35 వేలు గజానికి చొప్పున అప్ సెట్ రేటుతో రెండు సెషన్లలో ఈ- వేలంను నిర్వహించనున్నట్లు తెలిపారు.
మూడోసారి ఉప్పల్ భాగయత్ లే అవుట్ లోని భూములను విక్రయిస్తున్న హెచ్ఎండీఏ ఈ సారి మధ్య తరగతి ప్రజలు కూడా కొనుగోలు చేసేలా కనిష్టంగా 150 గజాల ప్లాట్లను కూడా అందుబాటులోకి తేవట, లే అవుట్ లో 60 శాతం ఖాళీ స్థలాన్ని కేటాయించటంతో పాటు ఈ-వేలంలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు 25 శాతం చెల్లించగానే నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ను ఇవ్వటంతో పాటు మిగిలిన సొమ్మును చెల్లించేందుకు హెచ్ఎండీఏ అధికారులే రుణాలిప్పించేందుకు నాలుగు బ్యాంకులను అందుబాటులోకి తేవటం పట్ల ప్లాట్ల విక్రయానికి చక్కటి స్పందన వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.