జీఎస్టీ వసూళ్ల కంటే అధికంగా పరోక్ష పన్ను ఆదాయం
దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 మహమ్మారి కారణంగా వస్తు, సేవల పన్ను ఆదాయం తగ్గినప్పటికీ, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో పరోక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. నికర పరోక్ష పన్ను వసూళ్లు 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21లో 12.3 శాతం పెరిగి రూ. 10.71 లక్షల కోట్లకు చేరుకున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం గణాంకాలను వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్ను వసూళ్లు రూ. 9.54 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2020-21లో నికర […]
దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 మహమ్మారి కారణంగా వస్తు, సేవల పన్ను ఆదాయం తగ్గినప్పటికీ, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో పరోక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. నికర పరోక్ష పన్ను వసూళ్లు 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21లో 12.3 శాతం పెరిగి రూ. 10.71 లక్షల కోట్లకు చేరుకున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం గణాంకాలను వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్ను వసూళ్లు రూ. 9.54 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
2020-21లో నికర పన్ను వసూళ్లు సవరించిన అంచనాల్లో 108.2 శాతం సాధించినట్టు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ పెరుగుదల ప్రధానంగా జీఎస్టీయేతర ఆదాయాల వల్ల నమోదయ్యాయని, నికర జీఎస్టీ వసూళ్లు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 5.48 లఖల కోట్లతో పోలిస్తే 8 శాతం పడిపోయాయి. కరోనా వల్ల గత ఆర్థిక సంవత్సరం మొదటి భాగం జీఎస్టీ వసూళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. రెండో భాగంలో మెరుగ్గా పుంజుకోవడంతో చివరి ఆరు నెలలు వరుసగా రూ. లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని వెల్లడించింది.