కరోనా మందు తయారీకి లోకల్ కంపెనీల ఆసక్తి!
దిశ,వెబ్‌దెస్క్: కరోనా వైరస్‌పై ప్రభావవంతంగా పనిచేస్తున్న యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డెసివిర్ తయారుచేయడానికి హైదరాబాద్‌కు చెందిన పలు ఔషధ కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయి. రెమ్‌డెసివిర్ ఔషధానికి సంబంధించి గిలియడ్ కంపెనీ 2035 వరకు పెటెంట్ హక్కులను పొందింది. కరోనాపై రెమ్‌డెసివిర్ పనిచేసే తీరుపై క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా, డా.రెడ్డీస్ లేబోరేటరీస్, లారస్ ల్యాబ్స్ ఈ ఔషధ జనరిక్ వెర్షన్‌ను తయారుచేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. గిలియడ్ సైన్సెస్ నుంచి దీన్ని తయారీ లైసెన్సును […]
దిశ,వెబ్‌దెస్క్: కరోనా వైరస్‌పై ప్రభావవంతంగా పనిచేస్తున్న యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డెసివిర్ తయారుచేయడానికి హైదరాబాద్‌కు చెందిన పలు ఔషధ కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయి. రెమ్‌డెసివిర్ ఔషధానికి సంబంధించి గిలియడ్ కంపెనీ 2035 వరకు పెటెంట్ హక్కులను పొందింది. కరోనాపై రెమ్‌డెసివిర్ పనిచేసే తీరుపై క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా, డా.రెడ్డీస్ లేబోరేటరీస్, లారస్ ల్యాబ్స్ ఈ ఔషధ జనరిక్ వెర్షన్‌ను తయారుచేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. గిలియడ్ సైన్సెస్ నుంచి దీన్ని తయారీ లైసెన్సును పొందడానికి ప్రయత్నిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే, నాట్కో ఫార్మా, లారస్ ల్యాబ్స్‌కు గిలియడ్ కంపెనీతో భాగస్వామ్య ఒప్పందం ఉంది. వీటితో పాటు మరో రెండు కంపెనీలు గ్లెన్‌మార్క్, సిప్లా కంపెనీలు సైతం దీని తయారీకి సిద్ధమవుతున్నాయి. దీనికితోడు ఈ ఔషధం తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు, ఏపీఐలపై ఇండియన్ కంపెనీలు దృష్టి పెట్టాయి. కీలకమైన ముడి పదార్థాలను సిద్ధం చేసినట్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వెల్లడించింది. వివిధ కంపెనీలు రెమ్‌డెసివిర్ జనరిక్ వెర్షన్లను విడుదల చేయడానికి గిలియడ్ సైన్సెస్ స్వచ్చంద లైసెన్స్ ఒప్పందాలను కుదుర్చుకోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది.