అమిత్ షా డైరెక్షన్‌లో హుజురాబాద్ ఎలక్షన్స్ : ప్రభుత్వ విప్ బాల్కసుమన్

దిశ, హుజూరాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ బీజేపీ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ లాంటి వారిని పార్టీలో చేర్చుకుని బీజేపీ ఆర్థిక నేరస్థులకు అడ్డాగా మారిందన్నారు. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 20 కంపెనీలకు చెందిన పారా మిలిటరీ సాయుధ బలగాలను హుజూరాబాద్‌లో దింపి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర […]

Update: 2021-10-26 05:11 GMT

దిశ, హుజూరాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ బీజేపీ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ లాంటి వారిని పార్టీలో చేర్చుకుని బీజేపీ ఆర్థిక నేరస్థులకు అడ్డాగా మారిందన్నారు. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 20 కంపెనీలకు చెందిన పారా మిలిటరీ సాయుధ బలగాలను హుజూరాబాద్‌లో దింపి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తుందని ఆరోపించారు. మద్యం, మాంసం, డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న బీజేపీ నాయకులు ఇతర పార్టీలపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా కనిపించని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అహంకారంతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై అవాకులు, చెవాకులు పేల్చుతున్నారని ఫైర్ అయ్యారు. ద్విచక్ర వాహనం పోతే కొనిస్తానని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. అబద్దాలు ఆడటంలో దిట్ట అయిన బీజేపీ నల్ల చట్టాలను తెచ్చి రైతుల నడ్డి విరుస్తుందన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలని సుమన్ కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, నాయకులు అక్కరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News