యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ వాటాల విక్రయానికి సిద్ధం!

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంకు, ఎఫ్ఎమ్‌సీజీ దిగ్గజ సంస్థ ఐటీసీల్లో తనకున్న వాటాలను విక్రయించడం ద్వారా రూ. 22,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. బల్క్ డీల్ విధానంలో 10 రోజుల్లో ఈ ప్రక్రియను ముగించే వీలున్నట్టు సమాచారం. ఐటీసీలో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్(ఎస్‌యూయూటీఐ) ద్వారా 7.94 శాతం, యాక్సిస్ బ్యాంకులో 4.69 శాతం ప్రభుత్వానికి వాటాలున్నాయి. సెన్సెక్స్‌లో ఈ సంస్థల షేర్ల ధరలను పరిశీలిస్తే..ఈ వాటాల విక్రయం […]

Update: 2020-05-07 00:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంకు, ఎఫ్ఎమ్‌సీజీ దిగ్గజ సంస్థ ఐటీసీల్లో తనకున్న వాటాలను విక్రయించడం ద్వారా రూ. 22,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. బల్క్ డీల్ విధానంలో 10 రోజుల్లో ఈ ప్రక్రియను ముగించే వీలున్నట్టు సమాచారం. ఐటీసీలో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్(ఎస్‌యూయూటీఐ) ద్వారా 7.94 శాతం, యాక్సిస్ బ్యాంకులో 4.69 శాతం ప్రభుత్వానికి వాటాలున్నాయి. సెన్సెక్స్‌లో ఈ సంస్థల షేర్ల ధరలను పరిశీలిస్తే..ఈ వాటాల విక్రయం ద్వారా ఎస్‌యూయూటీఐకి రూ. 22,000 కోట్లు లభిస్తాయని మార్కెట్లు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వరంగ సంస్థల్లోని వాటాలను విక్రయించి రూ. 2.10 లక్షల కోట్లను సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యమనే విషయం తెలిసిందే.

Tags : Axis Bank, ITC, UTI, Specified Undertaking Of The Unit Trust Of India

Tags:    

Similar News