ఇకపై ప్రయివేటు హాస్పిటల్స్‌లో కోవిడ్-19 టెస్టులు

తెలంగాణ రాష్ట్రంలో ఇకపై కోవిడ్-19 వంటి అత్యవసర కేసులు ప్రయివేటు హాస్పిటల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి జీవో నెం.45ను తెలంగాణ వైద్యా ఆరోగ్య శాఖ ఈనెల 22న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రయివేటు ఆస్పత్రులు ఉన్న పరిసరాల్లో కరోనా అనుమానితులకు టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ పాజిటివ్ అని తేలితే అందులోనే ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి వారికి వైద్యం అందజేయాలని తెలిపింది. అంతేకాని వారిని మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రులకు షిఫ్ట్ […]

Update: 2020-03-23 02:44 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఇకపై కోవిడ్-19 వంటి అత్యవసర కేసులు ప్రయివేటు హాస్పిటల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి జీవో నెం.45ను తెలంగాణ వైద్యా ఆరోగ్య శాఖ ఈనెల 22న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రయివేటు ఆస్పత్రులు ఉన్న పరిసరాల్లో కరోనా అనుమానితులకు టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ పాజిటివ్ అని తేలితే అందులోనే ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి వారికి వైద్యం అందజేయాలని తెలిపింది. అంతేకాని వారిని మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రులకు షిఫ్ట్ చేయడానికి వీళ్లేదన్నారు. కరోనా కేసులతో పాటే మిగతా ఎమర్జెన్సీ కేసులు డెలివరీ, యాక్సిటెంట్ వంటివి తప్ప ఓపీ సేవలను నిలిపివేయాలన్నారు. అదే విధంగా కరోనా పాజిటివ్ కేసులు ఏమైనా తేలితే 040-24651119 రాష్ట్ర విపత్తు సెల్‌కు సమాచారం అందించాలని కోరారు.

Tags: private hospitals, carona virus test, govt .45, emergency cases taken
slug ;

Tags:    

Similar News