ప్రజాసేవే పరమావధి.. ఒక్క రూపాయి లంచం తీసుకోవద్దు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంతో సుమారు 15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను కల్పించామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి నియామక పత్రాలను గురువారం ఆయన అందజేశారు. ఉద్యోగాలు సాధించిన వారందరికీ అభినందనలు తెలిపిన కేటీఆర్ ప్రజాసేవే పరమావధిగా పని చేయాలని వారికి సూచించారు. తమదైన మార్క్‌ను చూపించే […]

Update: 2021-04-08 10:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంతో సుమారు 15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను కల్పించామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి నియామక పత్రాలను గురువారం ఆయన అందజేశారు. ఉద్యోగాలు సాధించిన వారందరికీ అభినందనలు తెలిపిన కేటీఆర్ ప్రజాసేవే పరమావధిగా పని చేయాలని వారికి సూచించారు.

తమదైన మార్క్‌ను చూపించే విధంగా సేవ ధృక్పధాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని, ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా అత్యంత నిజాయితీతో పని చేయాలన్నారు. ప్రజా సేవకి పాటుపడాలని కోరారు. ఉద్యోగాన్ని ఒక సవాలుగా తీసుకొని జలమండలిని మరింత అభివృద్ధి పథాన నిలిపేవిధంగా వినూత్న ఆలోచనలతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం. దాన కిషోర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. సత్యనారాయణ పాల్గొన్నారు.

Tags:    

Similar News