ఆ రోజు గులాబీ కండువా కప్పుకోనే అనుమతులు ఇచ్చామా.. జమునపై అధికారుల ఫైర్
దిశ, మెదక్: ఈటల జమున వ్యాఖ్యలను మెదక్ జిల్లా అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. కలెక్టర్‌ను టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలి అనడంపై అభ్యంతరం తెలిపింది. గతంలో జమున హ్యాచరీస్ తీసుకున్న అనుమతులు మొత్తం టీఆర్ఎస్ కండువా కప్పుకున్న అధికారులే ఇచ్చారా.. అని ప్రశ్నించింది. మంగళవారం కలెక్టర్‌పై ఈటల జమున వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా అధికారుల సంఘం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా డీఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ అచ్చంపేట, హకీంపేట్‌లో జమున హ్యాచరీస్ 70. 33 […]
దిశ, మెదక్: ఈటల జమున వ్యాఖ్యలను మెదక్ జిల్లా అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. కలెక్టర్‌ను టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలి అనడంపై అభ్యంతరం తెలిపింది. గతంలో జమున హ్యాచరీస్ తీసుకున్న అనుమతులు మొత్తం టీఆర్ఎస్ కండువా కప్పుకున్న అధికారులే ఇచ్చారా.. అని ప్రశ్నించింది. మంగళవారం కలెక్టర్‌పై ఈటల జమున వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా అధికారుల సంఘం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా డీఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ అచ్చంపేట, హకీంపేట్‌లో జమున హ్యాచరీస్ 70. 33 ఎకరాలు అసైన్డ్, సీలింగ్ భూములను ఆక్రమించిందని, ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తున్నామని కలెక్టర్ ఎస్. హరీష్ వెల్లడించారని గుర్తు చేశారు. దీనిపై ఓ మహిళ అనుచితంగా మాట్లాడినట్లు మంగళవారం దినపత్రికలలో వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని, గులాబీ కండువా కప్పుకోవాలని అభ్యంతకర స్టేట్మెంట్ ఇవ్వడం బాధకలిగించిందని విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారుల సంఘం ఆ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఖండిస్తున్నామని తెలిపారు.
జిల్లా అధికారులందరూ ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల మేరకే పనిచేస్తారని, కానీ కండువా వేసుకోవడం, పార్టీకి పనిచేయడం అనే రాజకీయ దురుద్దేశం ఉద్యోగస్తులకు, జిల్లా అధికారులకు, జిల్లా మేజిస్ట్రేట్‌కు ఆపాదించడం భావ్యం కాదన్నారు. దీన్ని జిల్లా అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు.
జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న కలెక్టర్, వారి ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, అధికారుల పట్ల అనుచితంగా మాట్లాడడం భావ్యం కాదని అన్నారు. 2019 జమున హ్యాచరీస్ వాళ్లు చాలా అనుమతులు తీసుకున్నారని, ఆ రోజు ఎవరైతే అనుమతులు ఇచ్చారో వారంతా గులాబీ కండువా కప్పుకొని ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని వారు గుర్తుంచుకోని ప్రభుత్వ అధికారులను కించపరచేలా మాట్లాడే సంప్రదాయాన్ని మానుకోవాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్ కుమార్, బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, జిల్లా ఎస్డీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మీ, జిల్లా సంక్షేమాధికారి జయరాం నాయక్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ గంగయ్య తదితరులు పాల్గొన్నారు.