‘మిషన్ కొవిడ్ సురక్షా’ : రూ. 3,000 కోట్లతో నిధి ఏర్పాటు

న్యూఢిల్లీ: కొవిడ్ టీకా అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేసి సురక్షితమైన వ్యాక్సిన్ ఉత్పత్తికి, వాటిని ప్రజలకు చేరువ చేయడానికి కేంద్రం ప్రభుత్వం ‘మిషన్ కొవిడ్ సురక్షా’ను ప్రారంభించడానికి యోచిస్తున్నది. ఈ మిషన్ కింద కేంద్రప్రభుత్వం టీకా క్లినికల్ ట్రయల్స్ నుంచి ఉత్పత్తి వరకు అన్ని దశల్లో ఫోకస్ పెట్టనుంది. దేశంలో ఆరు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసి వీలైనంత తొందరగా దేశ ప్రజలకు అందుబాటులో చేయాలన్నదే ఈ మిషన్ లక్ష్యమని అధికారవర్గాలు తెలిపాయి. ఈ మిషన్‌ను బయోటెక్నాలజీ శాఖ […]

Update: 2020-08-24 09:37 GMT

న్యూఢిల్లీ: కొవిడ్ టీకా అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేసి సురక్షితమైన వ్యాక్సిన్ ఉత్పత్తికి, వాటిని ప్రజలకు చేరువ చేయడానికి కేంద్రం ప్రభుత్వం ‘మిషన్ కొవిడ్ సురక్షా’ను ప్రారంభించడానికి యోచిస్తున్నది. ఈ మిషన్ కింద కేంద్రప్రభుత్వం టీకా క్లినికల్ ట్రయల్స్ నుంచి ఉత్పత్తి వరకు అన్ని దశల్లో ఫోకస్ పెట్టనుంది.

దేశంలో ఆరు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసి వీలైనంత తొందరగా దేశ ప్రజలకు అందుబాటులో చేయాలన్నదే ఈ మిషన్ లక్ష్యమని అధికారవర్గాలు తెలిపాయి. ఈ మిషన్‌ను బయోటెక్నాలజీ శాఖ ప్రతిపాదించినట్టు వివరించాయి. అయితే, ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నట్టు పేర్కొన్నాయి. దేశ అవసరాల రీత్యా సరిపడా టీకా ఉత్పత్తి చేయడంపైనా ప్రతిపాదిత మిషన్ దృష్టి పెడుతుందని తెలిపాయి.

టీకా అభివృద్ధిపై ప్రాజెక్టు మోడ్‌లో కాకుండా మిషన్ మోడ్‌ను అవలంభించనున్నట్టు వివరించాయి. 12 నుంచి 15 నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడమే ఈ మిషన్ లక్ష్యమని పేర్కొన్నాయి. దీని కోసం రూ. 3,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేయనున్నట్టు వివరించాయి.

Tags:    

Similar News