టిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్(టిమ్స్)లో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది కాలం లేదా అవసరమున్నంత సమయం కొనసాగించేలా వివిధ విభాగాల్లో కలిపి 662 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 502, డిప్యూటేషన్ మీద 12, ఔట్ సోర్సింగ్‌లో 148 మందిని నియమించనున్నారు. బయో కెమిస్ట్రీ, పాథాలజీ, రేడియాలజీల ప్రొఫెసర్లు, […]

Update: 2020-06-02 11:17 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్(టిమ్స్)లో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది కాలం లేదా అవసరమున్నంత సమయం కొనసాగించేలా వివిధ విభాగాల్లో కలిపి 662 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 502, డిప్యూటేషన్ మీద 12, ఔట్ సోర్సింగ్‌లో 148 మందిని నియమించనున్నారు. బయో కెమిస్ట్రీ, పాథాలజీ, రేడియాలజీల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు 246 మంది స్టాఫ్ నర్సులు, 121 మంది మెడికల్ ఆఫీసర్లతో కలిపి 514 స్పెషలిస్టుల విభాగంలోనూ, 148 మంది వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బంది నియామకం చేపట్టనున్నారు.

Tags:    

Similar News