పేషెంట్‌కు అండగా నిలిచిన గవర్నర్ తమిళిసై

దిశ, వెబ్ డెస్క్: ఓ డయాలసిస్ పేషెంట్‌కు అండగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ నిలబడ్డారు. మహ్మద్ కలీమ్ ఉద్దీన్ హార్ట్ పేషెంట్. డయాలసిస్ చేయాల్సి ఉంది. అయితే డయాలసిస్ చేయించేందుకు అతని కుటుంబసభ్యులు ఉస్మానియా ఆస్పత్రిలో ఓపీకి ప్రయత్నించారు. దాదాపు ఏడు గంటలు కావస్తున్నా… ఆస్పత్రి సిబ్బంది వారిని పట్టించుకోవడం లేదు. ఏడు గంటలు గడిచిన అనంతరం ఆస్పత్రిలో బెడ్స్ లేవు, ఆక్సీజన్ లేదని చెప్పడంతో ఆందోళనకు గురైన బాధితుడి కుటుంబ సభ్యుడు రాష్ట్ర గవర్నర్ […]

Update: 2020-07-10 09:55 GMT

దిశ, వెబ్ డెస్క్: ఓ డయాలసిస్ పేషెంట్‌కు అండగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ నిలబడ్డారు. మహ్మద్ కలీమ్ ఉద్దీన్ హార్ట్ పేషెంట్. డయాలసిస్ చేయాల్సి ఉంది. అయితే డయాలసిస్ చేయించేందుకు అతని కుటుంబసభ్యులు ఉస్మానియా ఆస్పత్రిలో ఓపీకి ప్రయత్నించారు. దాదాపు ఏడు గంటలు కావస్తున్నా… ఆస్పత్రి సిబ్బంది వారిని పట్టించుకోవడం లేదు. ఏడు గంటలు గడిచిన అనంతరం ఆస్పత్రిలో బెడ్స్ లేవు, ఆక్సీజన్ లేదని చెప్పడంతో ఆందోళనకు గురైన బాధితుడి కుటుంబ సభ్యుడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్‌కు ట్వీట్ చేశారు. బాధితుడి ట్వీట్‌కు గవర్నర్ స్పందించారు. డయాలసిస్ పేషెంట్‌కు ట్రీట్‌మెంట్ అందించేలా తన ఉన్నతాధికారుల్ని ఆదేశించినట్టు, దగ్గరుండి ట్రీట్ మెంట్ కు ఏర్పాటు చేస్తారని బాధితుడి ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చారు.

Tags:    

Similar News