బతుకమ్మ సంబురాల్లో గవర్నర్తమిళిసై
దిశ, తెలంగాణ బ్యూరో : బతుకమ్మ పాటలో ఉండే తెలుగు పదాలపై పరిశోధన చేపట్టాలని, అలా అయితేనే తెలుగు భాష మరింత పరిపుష్టమవుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో గవర్నర్తమిళిసై తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. గవర్నర్ తో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. బతుకమ్మ పండుగ అత్యంత ప్రాచీనమైనదని, తెలంగాణ జాగృతితో పాటు, అనేక సంస్థలు ఈ వేడుకకు […]
దిశ, తెలంగాణ బ్యూరో : బతుకమ్మ పాటలో ఉండే తెలుగు పదాలపై పరిశోధన చేపట్టాలని, అలా అయితేనే తెలుగు భాష మరింత పరిపుష్టమవుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో గవర్నర్తమిళిసై తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. గవర్నర్ తో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు.
బతుకమ్మ పండుగ అత్యంత ప్రాచీనమైనదని, తెలంగాణ జాగృతితో పాటు, అనేక సంస్థలు ఈ వేడుకకు సంబంధించిన పాటలు సేకరిస్తున్నాయన్నారు. పాత బతుకమ్మ పాటల్లో ఉండే పదాల మీద ప్రత్యేక అధ్యయనం చేపడితే మనం మరిచిపోయిన తెలుగు పదాలు, తెలంగాణ పదాలను బతికించిన వాళ్లమవుతామన్నారు. దీనిపై వీసీ ఆలోచన చేయాలని ఆమె కోరారు. గవర్నర్ తమిళి సై ప్రతిరోజు రాజ్ భవన్ లో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వం తరుపున ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నట్లుగా ఆమె వెల్లడించారు.