పబ్లిక్ గార్డెన్‌లో రిపబ్లిక్ డే వేడుకలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ పబ్లిక్‌గార్డెన్‌లో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళి సై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై ప్రసగిస్తూ తెలంగాణ మిగతా రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని, కరోనాను రాష్ట్ర ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొందన్నారు. భారత్ బయోటెక్ తొలి దేశీయ టికాను […]

Update: 2021-01-26 00:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ పబ్లిక్‌గార్డెన్‌లో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళి సై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై ప్రసగిస్తూ తెలంగాణ మిగతా రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని, కరోనాను రాష్ట్ర ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొందన్నారు. భారత్ బయోటెక్ తొలి దేశీయ టికాను రూపొందించిందని గవర్నర్ తెలిపారు. ఫ్రంట్ లైన్‌ వారియర్స్‌కు హృదయపూర్వక ధన్యవాదలు తెలిపిన గవర్నర్.. కరోనా సమయంలో సొంత ఖర్చులతో వలస కూలీలను తరలించామని స్పష్టం చేశారు.

పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, పల్లె ప్రగతి పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, హరితహారంలో నాటిన మొక్కల్లో 91శాతం సంరక్షించామని పేర్కొన్నారు. 12వేలకు పైగా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశామని, గ్రామాల్లో వైకుంఠ ధామాల ఏర్పాటు, రైతులు చర్చించుకునేందుకు వీలుగా రైతు వేదికల నిర్మాణాలు, పట్టణాల్లో మౌలిక సౌకర్యాల కోసం ఏటా రూ.148 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. 2,802 పారిశుద్ధ్య వాహనాలు ఏర్పాటు, రాష్ట్రం మరో 2,004 పారిశుద్ధ్య వాహనాలు అందిస్తుందని వివరించారు.

Tags:    

Similar News