ఖైరతాబాద్ గణేషుడికి తొలి పూజ.. హాజరైన గవర్నర్ తమిళి సై

దిశ, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ గణనాథుడికి గవర్నర్లు తమిళి సై సౌందరరాజన్, బండారు దత్తాత్రేయలు తొలి పూజలు అందించారు. ఈ ఏడాది 40 అడుగుల పంచముఖ రుద్ర మహాగణపతిని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహకులు ప్రతిష్టించారు. తొలి రోజు గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా మండపం పరిసరప్రాంతాల్లో పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. పూజలు నిర్వహించిన అనంతరం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మాట్లాడుతూ.. కరోనా రహిత సమాజం […]

Update: 2021-09-10 04:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ గణనాథుడికి గవర్నర్లు తమిళి సై సౌందరరాజన్, బండారు దత్తాత్రేయలు తొలి పూజలు అందించారు. ఈ ఏడాది 40 అడుగుల పంచముఖ రుద్ర మహాగణపతిని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహకులు ప్రతిష్టించారు. తొలి రోజు గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా మండపం పరిసరప్రాంతాల్లో పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. పూజలు నిర్వహించిన అనంతరం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మాట్లాడుతూ.. కరోనా రహిత సమాజం నెలకొనేలా గణనాథుడు దీవించాలని కోరారు.

తొలి పూజలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజలందరి కష్టాలు తొలిగిపోయి సుఖ సంతోషాలతో జీవించే పరిస్థితులను నెలకొల్పాలని వేడుకున్నారు. అభివృద్ధిపథం వైపు నడిచేలా దీవించాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకాను వేసుకొని వైరస్ ను సమూలంగా నిర్మూలించాలని సూచించారు. విజ్ఞాలను తొలగించేలా వినాయకుడు ఆశీర్వాదించాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. కోవిడ్ భారీ నుంచి ప్రజలను కాపాడి దీవించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News