డాక్టర్ నరేష్ కుటుంబాన్ని ఆదుకోండి

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఇటీవల కరోనా బారినపడి డాక్టర్ నరేష్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కోరారు. ఈమేరకు ఆదివారం టీజీజీడీఏ నేతలు మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా టీజీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇమ్మ్యూనైజేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ నరేష్ వృత్తి పట్ల నిబద్ధతతో […]

Update: 2020-08-09 08:50 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఇటీవల కరోనా బారినపడి డాక్టర్ నరేష్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కోరారు. ఈమేరకు ఆదివారం టీజీజీడీఏ నేతలు మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా టీజీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇమ్మ్యూనైజేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ నరేష్ వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేసేవారని అన్నారు. ఆయన

కరోనా బారినపడి చనిపోవడం బాధకరం అన్నారు. డాక్టర్ నరేష్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ మెడికల్ & పబ్లిక్ హెల్త్ జాక్ కన్వీనర్ కర్నాటి సాయిరెడ్డి, వర్కింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కత్తి జనార్ధన్, సెక్రటరీ జనరల్ డాక్టర్ షరీఫ్, కోశాధికారి డాక్టర్ శ్రీ క్రిష్ణారావు, సెక్రటరీ డాక్టర్ రవి ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ అభిరాం తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News