ప్రభుత్వం చెప్పిన పంటలనే వేయాలి: ఎర్రబెల్లి
దిశ, వరంగల్: ప్రభుత్వం చెప్పిన విధంగా లాభసాటి పంటలు వేసి రైతులు బాగు పడాలనేది సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు, రైతులు మంచి ధరలు పొంది లాభపడాల్సిన ఆవశ్యకతపై ఆదివారం జనగామ జిల్లాలో మంత్రి సమావేశం నిర్వహించారు. రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, జెడ్పీచైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి ఛైర్మన్, […]
దిశ, వరంగల్: ప్రభుత్వం చెప్పిన విధంగా లాభసాటి పంటలు వేసి రైతులు బాగు పడాలనేది సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు, రైతులు మంచి ధరలు పొంది లాభపడాల్సిన ఆవశ్యకతపై ఆదివారం జనగామ జిల్లాలో మంత్రి సమావేశం నిర్వహించారు. రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, జెడ్పీచైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి ఛైర్మన్, సభ్యులు, జిల్లా కలెక్టర్, వ్యవసాయశాఖ సహా, పలుశాఖలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కడెక్కడ ఏయే నేలల్లో ఏయే పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందో ప్రభుత్వమే నిర్ణయిస్తుందస్తున్నారు. ఏ పంటలకు మంచి డిమాండ్ ఉందో ప్రభుత్వమే చెబుతుందని మంత్రి పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు రూపొందించిన పంటల ప్రణాళిక వ్యవసాయశాఖ వద్ద సిద్ధంగా ఉందని, ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే పెట్టుబడులు, రైతుబంధు పథకాలు అందుతాయని మంత్రి సూచించారు.