కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు: హరీశ్‌రావు
దిశ, మెదక్: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసీ భవన్‌లో పేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. ఇందుకు ప్రజల సహకారం, వైద్యులు, పోలీసుల సేవలే కారణమన్నారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటు.. మీటరు దూరం డిస్టెన్స్ పాటించాలన్నారు. […]
దిశ, మెదక్: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసీ భవన్‌లో పేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. ఇందుకు ప్రజల సహకారం, వైద్యులు, పోలీసుల సేవలే కారణమన్నారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటు.. మీటరు దూరం డిస్టెన్స్ పాటించాలన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: minister harish rao, daily needs, distribution, gajwel, ts news