అప్పు సరే… వడ్డీ రాయితీ ఏది..?

దిశ, తెలంగాణ బ్యూరో : అప్పులు తీసుకోవడంలో మహిళా సంఘాలు లక్ష్యాన్ని చేరుకున్నాయి. ప్రభుత్వం నిర్ధేశించిన రూ. 10 వేల కోట్ల రుణాలను రాష్ట్రంలోని 46 లక్షల మంది మహిళలు తీసుకున్నారు. వడ్డీలేని రుణాలు అంటూ ప్రభుత్వం చెప్పుతున్నా… 2018 నుంచి వడ్డీ రాయితీని విడుదల చేయడం లేదు. దీంతో బ్యాంకులకు వడ్డీలతో సహా వాయిదాలు చెల్లిస్తున్నారు. ఈసారి ప్రభుత్వం బడ్జెట్​లో రూ. 3 వేల కోట్లు వడ్డీ రాయితీ కోసం కేటాయిస్తున్నట్లు ప్రతిపాదించింది. అయితే 2018 […]

Update: 2021-03-29 22:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అప్పులు తీసుకోవడంలో మహిళా సంఘాలు లక్ష్యాన్ని చేరుకున్నాయి. ప్రభుత్వం నిర్ధేశించిన రూ. 10 వేల కోట్ల రుణాలను రాష్ట్రంలోని 46 లక్షల మంది మహిళలు తీసుకున్నారు. వడ్డీలేని రుణాలు అంటూ ప్రభుత్వం చెప్పుతున్నా… 2018 నుంచి వడ్డీ రాయితీని విడుదల చేయడం లేదు. దీంతో బ్యాంకులకు వడ్డీలతో సహా వాయిదాలు చెల్లిస్తున్నారు. ఈసారి ప్రభుత్వం బడ్జెట్​లో రూ. 3 వేల కోట్లు వడ్డీ రాయితీ కోసం కేటాయిస్తున్నట్లు ప్రతిపాదించింది. అయితే 2018 నుంచి దాదాపు రూ. 3 వేల కోట్ల వడ్డీ రాయితీ ప్రభుత్వం… రాష్ట్రంలోని మహిళా సంఘాలకు బాకీ ఉంది. కేటాయించినట్టుగానే వడ్డీ రాయితీ విడుదల చేస్తే… ఈసారి తీసుకున్న రుణాలకు ఎలా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రాయితీ విడుదల చేసే ప్రభుత్వం ఇటీవల మాత్రం ఏళ్ల తరబడి పెండింగ్​ పెడుతూనే ఉంది.

సెర్ఫ్​ సక్సెస్​

ఈ ఏడాది మహిళా సంఘాలకు రుణ లక్ష్యం రూ. 10వేల కోట్లుగా నిర్ధారించారు. బ్యాంకు లింకేజీ రుణాల పరిధిని కూడా పెంచారు. ఒక్కో సంఘానికి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచడంతో సంఘాలకు విరివిగా లోన్ లు మంజూరు చేశారు. గతంలో ఒక రుణం ఉంటే ఇంకో రుణం ఇవ్వని బ్యాంకులు… ఈసారి ప్రభుత్వ నిబంధనలతో రుణం ఉన్నా మళ్లీ రుణం ఇచ్చింది. దీంతో మహిళా సంఘాలు అడిగినంత లోన్లు మంజూరు చేశారు. సెర్ఫ్​ సిబ్బంది గ్రామస్థాయిలో సంఘాలకు రుణాలు ఇప్పించడంలో సక్సెస్​ అయ్యాయి. ఉన్నతాధికారుల నుంచి కొంతమేరకు ఒత్తిడి ఉండటంతో రుణాల అంశంలో కీలకంగా పని చేశారు. దీంతో బ్యాంకు లింకేజీ రుణాలు బుధవారం నాటికి రూ. 10,166 కోట్లకు చేరాయి. మొత్తం 3,12,468 స్వశక్తి సంఘాలకు ఈ లోన్లు ఇచ్చారు. రుణాల్లో మన రాష్ట్రం 99.18 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది.

మిత్తి కోసమే బెంగ

మహిళలు తీసుకున్న రుణాలను వాయిదా పద్దతిలో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. ప్రతినెలా క్రమం తప్పకుండా నిర్ణీత గడువులోగా చెల్లించిన రుణాలకు ప్రభుత్వం వడ్డీ రాయితీని విడుదల చేయాల్సి ఉంటోంది. వైఎస్​ హాయాంలో పావలా వడ్డీ ఉండగా… ఆ తర్వాత వడ్డీ లేని రుణాలను ప్రకటించారు. దీంతో 2011 నుంచి మహిళల రుణాలకు వడ్డీని ప్రభుత్వం విడుదల చేస్తోంది. ముందుగా బ్యాంకులకు 12.5 శాతం వడ్డీతో కలిపి మహిళలు చెల్లిస్తే… వాటిని తిరిగి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.
అయితే 2018 నుంచి ప్రభుత్వం వడ్డీ రాయితీని విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది. దీంతో మహిళలు మొత్తం వడ్డీతో సహా చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 3 వేల కోట్లు వడ్డీ రాయితీ కింది ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. కానీ మూడేండ్ల నుంచి పెండింగ్​ పెట్టారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వడ్డీ రాయితీ కింద రూ. 600 కోట్లు ఇచ్చారు. అంతే మినహా మళ్లీ రూపాయి విడుదల చేయలేదు.
ప్రస్తుతం రూ. 10 వేల కోట్ల రుణాలు తీసుకున్న మహిళలకు వడ్డీ రాయితీపై ఆందోళన నెలకొంది. లక్ష్యం సాధించేందుకు విరివిగా రుణాలు ఇప్పించినా… వడ్డీ రాయితీలో మాత్రం చేతులెత్తేస్తున్నారు. ఈసారి కూడా వడ్డీతో సహా కలిపి చెల్లిస్తే మహిళలపై భారం పడుతోంది. ప్రస్తుతం బడ్జెట్​లో నిధులు కేటాయించినట్లు చెప్పుతున్నా… అవి పాత అప్పులకే సరిపోతాయి. అంటే కొత్తగా తీసుకున్న రుణాలకు వడ్డీరాయితీ ఇస్తుందా… ఎప్పుడు ఇస్తుందో అనే ఆందోళన మహిళల్లో నెలకొంది.

రీపేమెంట్​లో నెంబర్​ వన్​

మరోవైపు రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న అప్పు చెల్లించడంలో కూడా దేశ వ్యాప్తంగా ప్రథమ స్థానంలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం వడ్డీ రాయితే. క్రమం తప్పకుండా ప్రతినెలా వాయిదాలు చెల్లిస్తేనే వడ్డీ రాయితీకి అర్హులవుతారు. ఈ నిబంధనలతో మహిళలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చెల్లింపులు చేస్తున్నారు. దీంతో మన రాష్ట్ర మహిళలు 99 శాతం రీ పేమెంట్​తో నెంబర్​వన్​గా ఉన్నారు. కానీ ప్రభుత్వమే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

Tags:    

Similar News