దివ్యాంగ వాలంటీర్ కుటుంబానికి  అండగా నిలిచిన ప్రభుత్వం..

దిశ, ఏపీ బ్యూరో: వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడిన దివ్యాంగ వాలంటీర్‌ కుటుంబానికి జగన్ సర్కార్ అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించింది. వివరాల్లోకి వెళ్తే.. దివ్యాంగురాలైన ఉమ్మనేని భువనేశ్వరి ప్రకాశం జిల్లా ఒంగోలులో వాలంటీర్‌గా విధులు నిర్వర్తించేది. ఆర్థిక ఇబ్బందులు, చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం, సోదరి కూడా అనారోగ్యం పాలవ్వడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యింది. గతేడాది డిసెంబర్‌లో ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై […]

Update: 2021-11-10 07:46 GMT

దిశ, ఏపీ బ్యూరో: వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడిన దివ్యాంగ వాలంటీర్‌ కుటుంబానికి జగన్ సర్కార్ అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించింది. వివరాల్లోకి వెళ్తే.. దివ్యాంగురాలైన ఉమ్మనేని భువనేశ్వరి ప్రకాశం జిల్లా ఒంగోలులో వాలంటీర్‌గా విధులు నిర్వర్తించేది. ఆర్థిక ఇబ్బందులు, చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం, సోదరి కూడా అనారోగ్యం పాలవ్వడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యింది. గతేడాది డిసెంబర్‌లో ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స్పందించారు. బాధితురాలి కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ను కోరారు. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు. దీనికి సంబంధించిన చెక్కును వాసిరెడ్డి పద్మ భువనేశ్వరి తల్లి ఉమ్మనేని జానకికి అందించారు.

Tags:    

Similar News