‘భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి’

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణరంగ కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఐదు రోజులుగా అడ్డా, హమాలీ, భవన నిర్మాణరంగ కార్మికులు తిండిలేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పస్తులతో ఉండలేక పనుల కోసం వెళ్తున్న కార్మికులను పోలీసులు లాఠీలతో కొడుతున్నారని తెలిపారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు రూ.10వేలు, 35 కిలోల బియ్యాన్ని ఇవ్వాలని భవన నిర్మాణ రంగ కార్మికుల […]

Update: 2020-03-29 09:59 GMT

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణరంగ కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఐదు రోజులుగా అడ్డా, హమాలీ, భవన నిర్మాణరంగ కార్మికులు తిండిలేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పస్తులతో ఉండలేక పనుల కోసం వెళ్తున్న కార్మికులను పోలీసులు లాఠీలతో కొడుతున్నారని తెలిపారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు రూ.10వేలు, 35 కిలోల బియ్యాన్ని ఇవ్వాలని భవన నిర్మాణ రంగ కార్మికుల సంఘం అధ్యక్షుడు లక్ష్మన్ కోరారు. పనులు, తిండిలేక కుటుంబాలతో అవస్థలు పడుతున్నామనీ, ప్రభుత్వం తమను పట్టించుకోవాలని కోరారు.

Tags: bulding workers, CITU, rangareddy, keesari narsi reddy, hamali, lockdown

Tags:    

Similar News