భయబ్రాంతులకు గురిచేస్తున్నారు : ఎమ్మెల్యే సీతక్క

దిశ, వరంగల్: ఏజెన్సీ ప్రాంతాల్లో 30 ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిన భూముల్లో కూడా ఈ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములు గుంజుకుంటోందని మండిపడ్డారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం రైతులకు పట్టాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం ఆమె ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో […]

Update: 2020-06-15 03:49 GMT

దిశ, వరంగల్: ఏజెన్సీ ప్రాంతాల్లో 30 ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిన భూముల్లో కూడా ఈ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములు గుంజుకుంటోందని మండిపడ్డారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం రైతులకు పట్టాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం ఆమె ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారులు తక్షణమే దాడులు నిలిపివేయాలన్నారు. గత అసెంబ్లీలో ముఖ్యమంత్రి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం రైతులకు పట్టాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

Tags:    

Similar News