సినిమా షూటింగులకు ఓకే చెప్పిన ప్రభుత్వం..

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొన్నిరోజులుగా అమలు చేస్తున్న లాక్ డౌన్ ప్రభావం వలన ఈ మహమ్మారి కాస్త నెమ్మదించింది. ఇక ఇటీవల కాలంలో అత్యధిక కేసులు నమోదు చేసిన మహారాష్ట్రలో కరోనా బీభత్సం కొంతవరకు తగ్గడంతో ప్రభుత్వం లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు చేస్తూ ఆదేశాలను జారీచేసింది. ఇక ఈ నేపథ్యంలోనే ముంబై లో షూటింగ్లు జరుపుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా ఆపేసిన […]

Update: 2021-06-06 00:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొన్నిరోజులుగా అమలు చేస్తున్న లాక్ డౌన్ ప్రభావం వలన ఈ మహమ్మారి కాస్త నెమ్మదించింది. ఇక ఇటీవల కాలంలో అత్యధిక కేసులు నమోదు చేసిన మహారాష్ట్రలో కరోనా బీభత్సం కొంతవరకు తగ్గడంతో ప్రభుత్వం లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు చేస్తూ ఆదేశాలను జారీచేసింది. ఇక ఈ నేపథ్యంలోనే ముంబై లో షూటింగ్లు జరుపుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

లాక్ డౌన్ కారణంగా ఆపేసిన సినిమా, సీరియళ్ల షూటింగులను కరోనా నియమాలను పాటిస్తూ జరుపుకోవచ్చని తెలిపింది. కరోనా పాజిటివిటీ రేటు, ఆస్పత్రుల్లో బెడ్‌ ఆక్యుపెన్సీ రేటు ఆధారంగా నగరాలు, జిల్లాలకు లెవల్స్‌ నిర్ణయించి, దశల వారీగా అన్‌లాక్‌ ప్లాన్‌ అమలు చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి ముంబైలో షూటింగ్లు మొదలుకానున్నాయి. త్వరలోనే థియేటర్లు-షాపింగ్‌ మాల్స్‌ కూడా తెరవనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News