ఏరువాక వస్తే పండుగ చేసుకునేవాళ్లం : సబితా ఇంద్రారెడ్డి

దిశ, రంగారెడ్డి: రైతులు వేసే పంటలకు అధిక దిగుబడితో పాటు లాభాలు వచ్చే విదంగా ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళికలు చేపట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నియంత్రిత పంటల సాగుపై వికారాబాద్ జిల్లాలోని గొట్టి ముక్కుల గ్రామంలో జరిగిన రైతు నివేదిక సభలో పాల్గొని ప్రసంగించారు. రైతుల బాగు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ తపన పడుతున్నారన్నారు. ఏరువాక వస్తే పండుగ చేసుకునేవాళ్ళం… ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి రావాలని ప్రభుత్వం కోరుకుంటున్నామని, రైతుకు సాగునీరు, విద్యుత్, […]

Update: 2020-05-29 03:21 GMT

దిశ, రంగారెడ్డి: రైతులు వేసే పంటలకు అధిక దిగుబడితో పాటు లాభాలు వచ్చే విదంగా ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళికలు చేపట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నియంత్రిత పంటల సాగుపై వికారాబాద్ జిల్లాలోని గొట్టి ముక్కుల గ్రామంలో జరిగిన రైతు నివేదిక సభలో పాల్గొని ప్రసంగించారు. రైతుల బాగు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ తపన పడుతున్నారన్నారు. ఏరువాక వస్తే పండుగ చేసుకునేవాళ్ళం… ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి రావాలని ప్రభుత్వం కోరుకుంటున్నామని, రైతుకు సాగునీరు, విద్యుత్, ఎరువులు, విత్తనాలు అందిస్తే రైతు కష్టాలు దూరం అయినట్లేనని భావించిన ముఖ్యమంత్రి ఆ దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. మన ప్రాంతానికి సాగు నీరు తీసుకువచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. బంగారు తెలంగాణ కావాలంటే రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించి స్థాయికి రావాలని అన్నారు. పంట మార్పిడి తో అధిక దిగుబడి సాధించొచ్చునని అన్నారు. రైతు దగ్గరకెళ్లి ధాన్యం కొంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, విద్యా మౌలిఖ సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, జెడ్పీటీసీ ప్రమోదిని, ఎంపీపీ చంద్ర కళ, పీఏసీఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి, గొట్టిముక్కుల సర్పంచ్ తో పాటు క్లస్టర్ ల సర్పంచ్ లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News