విశ్రాంత అధికారి లక్ష్మారెడ్డి ఏడాది పొడగింపు

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో పదవీ విరమణ పొంది ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారుల జాబితాలో మరొకరు చేరారు. ఇప్పటికే పలు విభాగాల్లో విశ్రాంత అధికారులే కీలకపాత్ర పోషిస్తుండగా తాజాగా పశుసంవర్థక శాఖ డైరెక్టర్ పోస్టును కూడా పదవీ విరమణ పొందిన అధికారితో భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా గత నెలలో పదవీ విరమణ పొందిన డా.వి లక్ష్మారెడ్డిని ఏడాదిపాటు కాంట్రాక్ట్ బేసిక్‌పై కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతనెల 31న […]

Update: 2020-08-03 10:36 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో పదవీ విరమణ పొంది ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారుల జాబితాలో మరొకరు చేరారు. ఇప్పటికే పలు విభాగాల్లో విశ్రాంత అధికారులే కీలకపాత్ర పోషిస్తుండగా తాజాగా పశుసంవర్థక శాఖ డైరెక్టర్ పోస్టును కూడా పదవీ విరమణ పొందిన అధికారితో భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా గత నెలలో పదవీ విరమణ పొందిన డా.వి లక్ష్మారెడ్డిని ఏడాదిపాటు కాంట్రాక్ట్ బేసిక్‌పై కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతనెల 31న ఆయన పదవీ విరమణ అనంతరం డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి అనితా రాజేంద్రకు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం లక్ష్మారెడ్డికి పొడగింపు రావడంతో డైరెక్టర్‌గా ఆయనే వ్యవహరించనున్నారు.

కాగా రాష్ట్రంలో విశ్రాంత అధికారులు ఆయా విభాగాల్లో పని చేస్తున్నారు. పలు కీలక విభాగాల్లో వారిదే పెత్తనం సాగుతోంది. దీనిపై శాఖల పరంగా పలు విమర్శలు ఎదురవుతున్నాయి. పదవీ విరమణ పొందిన వారికే తిరిగి కీలక బాధ్యతలను అప్పగిస్తుండటంతో జాయింట్ డైరెక్టర్ హోదాలో పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని, వారికి అనుకూలమైన నిర్ణయాలే తీసుకుంటున్నారని ఇప్పటికే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా లక్ష్మారెడ్డిని తిరిగి కాంట్రాక్ట్ పద్ధతిన నియమించడంపై కిందిస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Tags:    

Similar News